
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప. కాగా సుకుమార్ ఈ సినిమాలో ఎలాగైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఓ స్పెషల్ సాంగ్ కోసం ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఏ స్టార్ హీరోయిన్ బన్నీతో స్టెప్స్ వేయడానికి ఒప్పుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచుస్తోన్న ఫ్యాన్స్ కి అధికారికంగా క్లారిటీ ఇచ్చింది ఊర్వశి రౌటేలా. ఈ బాలీవుడ్ బ్యూటీ బన్నీ సరసన స్పెషల్ సాంగ్ లో నటించబోతున్నానని ట్వీట్ చేస్తూ.. ‘డాన్స్ లో నాకు ప్రేరణ అల్లు అర్జునే. బన్నీతో ఓ స్పెషల్ సాంగ్ లో నటించబోతున్నాను. బన్నీ సినిమాతో నా సౌత్ ఇండియన్ డాన్స్ స్టైల్ ని మీకు చూపిస్తాను’ అంటూ ఊర్వశి రౌటేలా తన అదిరిపోయే డాన్స్ చేసిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ మంచి కిక్ ఇచ్చే న్యూసే.
Also Read: ఆ హీరో నిజంగా బంగారమే.. అభిమాని చెప్పును తాకిన స్టార్ హీరో
కాగా నవంబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అయితే షూట్ స్టార్ట్ చేసే ముందు యూనిట్ సభ్యులందరికీ కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ షూట్ జరుగుతున్న అంత కాలం జన సాంద్రతకు దూరమైన ప్రాంతంలోనే అందర్నీ ఉంచాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే పుష్ప చిత్రబృందం వారు ఇతరులను కలవడం గాని.. ఇతరులు వారున్న ప్రదేశానికి రావడం గాని లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది.
Also Read: ప్రభాసా.. మజాకా..! : సౌత్ ఇండియాలోనే టాప్
ఇక ఎలాగూ తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించడానికి మొదట ఒప్పుకుని, ఆ తరువాత కరోనాతో డేట్స్ ఎడ్జెస్ట్ కాలేదు అంటూ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ పాత్రలో నారా రోహిత్ నటిస్తాడట. అన్నిటికంటే మెయిన్ గా ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈ సారి కూల్ గా తీరిగ్గా కూర్చుని ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటంతో సాంగ్స్ అన్ని బాగా వస్తున్నాయట. ఇప్పటికే దేవి నాలుగు ట్యూన్స్ కంపోజ్ చేశాడట. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా సుకుమార్, సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
When i act like lady @alluarjun (my inspiration) #AlluArjun 😛. Presenting you my South Indian Dance Style for my film #BlackRose 🎥!!!!#love #UrvashiRautela #Dance pic.twitter.com/CprMSM57Gr
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) September 27, 2020