https://oktelugu.com/

Nagarjuna: ‘సమంత’కి షరతులు.. అవి చెత్త, నేను పట్టించుకోను – నాగార్జున

Nagarjuna: చైతు – సమంత విడాకులకు ముఖ్య కారణం.. సమంతకు అఖినేని కుటుంబం పెట్టిన షరతులు అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే, అఖినేని కుటుంబం కారణమంటూ వస్తున్న వార్తల పై తాజాగా నాగార్జున స్పందించాడు. ‘ప్రస్తుత రోజుల్లో కావాలని ఇలాంటి చెత్త వార్తలు సృష్టిస్తున్నారు. వీటి గురించి నేను ఎక్కువగా ఆలోచించను, అలాగే పట్టించుకోను’ అని నాగార్జున తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఇక నిన్న సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడాకుల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 22, 2022 / 03:14 PM IST
    Follow us on

    Nagarjuna: చైతు – సమంత విడాకులకు ముఖ్య కారణం.. సమంతకు అఖినేని కుటుంబం పెట్టిన షరతులు అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే, అఖినేని కుటుంబం కారణమంటూ వస్తున్న వార్తల పై తాజాగా నాగార్జున స్పందించాడు. ‘ప్రస్తుత రోజుల్లో కావాలని ఇలాంటి చెత్త వార్తలు సృష్టిస్తున్నారు. వీటి గురించి నేను ఎక్కువగా ఆలోచించను, అలాగే పట్టించుకోను’ అని నాగార్జున తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు.

    Nagarjuna

    ఇక నిన్న సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడాకుల ప్రకటన పోస్టును తొలగించడం సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశమైంది. సామ్-చై మళ్లీ కలుస్తున్నారు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. అటు అభిమానుల్లోనూ ఈ చర్చ మొదలైంది. సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుందని.. విడాకుల పోస్ట్ డిలీట్ వెనుక ఏదో కారణం ఉందని అంటున్నారు. కానీ నాగార్జున మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించాడు.

    Also Read:  థర్టీ ప్లస్ లో విడాకులు… సమంత-చైతూలలో మొదట శుభవార్త చెప్పేదెవరు?

    Nagarjuna

    కాబట్టి.. చైతు – సామ్ మళ్ళీ కలవక పోవచ్చు. ఎలాగూ చైతూ మాత్రం విడాకుల పోస్టును డిలీట్ చేయలేదు. పైగా ‘మేము విడాకులు తీసుకున్నాక సంతోషంగా ఉన్నాం అని, నేను హ్యాపీగా ఉన్నాను, సమంత కూడా చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ చైతు చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా మేము ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉన్నాం’ అని కూడా చైతు తెలిపాడు. మరి విడాకుల పోస్ట్ లను సామ్ డిలీట్ చేసింది. మొత్తానికి ప్రేమించి పెళ్ళి చేసుకున్న నాగచైతన్య-సమంత వైవాహిక బంధానికి స్వస్తి పలికారు.

    Also Read: టీడీపీకి ఆయుధం దొరికినట్టేనా? మరి మంత్రి కొడాలి నాని పరిస్థితి ఏంటి?

    Tags