https://oktelugu.com/

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు

మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి.. చిరంజీవి సోదరుడి కుమార్తె నిహారిక అంటే తెలియని వారుండరు. యాంకర్ గా మొదలైన ఆమె ప్రస్తానం అనంతరం సినిమాల్లో హీరోయిన్ గా సాగింది. వెండితెరపై సత్తా చాటింది. ఇటు బుల్లితెరపై కూడా సందడి చేసింది. అయితే అప్పట్లోనే నిహారికకు గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేసిన ఐపీఎస్ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు, వ్యాపారవేత్త వెంకట చైతన్యతో ఇటీవల డిసెంబర్ లో ఘనంగా జరిపించారు. ఇక వివాహం తర్వాత నిహారిక తన […]

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2021 / 09:02 AM IST
    Follow us on

    మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి.. చిరంజీవి సోదరుడి కుమార్తె నిహారిక అంటే తెలియని వారుండరు. యాంకర్ గా మొదలైన ఆమె ప్రస్తానం అనంతరం సినిమాల్లో హీరోయిన్ గా సాగింది. వెండితెరపై సత్తా చాటింది. ఇటు బుల్లితెరపై కూడా సందడి చేసింది.

    అయితే అప్పట్లోనే నిహారికకు గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేసిన ఐపీఎస్ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు, వ్యాపారవేత్త వెంకట చైతన్యతో ఇటీవల డిసెంబర్ లో ఘనంగా జరిపించారు. ఇక వివాహం తర్వాత నిహారిక తన భర్త చైతన్యతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

    వివాహం తర్వాత తన వ్యక్తిగత విషయాలు, సినిమా విషయాలతోపాటు ఆ మధ్య మాల్దీవులకు హనీమూన్, ఇటీవల పాండిచ్చేరిలో ఎంజాయ్ చేసిన విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిహారిక హంగామా చేసింది.

    వివాహం అనంతరం నిహారిక, తన భర్త చైతన్యతో కలిసి బంజారాహిల్స్ పరిధిలో ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. విడిగా వీరిద్దరే ఉంటున్నారు.

    అయితే గత అర్ధరాత్రి నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని.. ఆమె భర్త చైతన్య నూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్ మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త సైతం అపార్ట్ మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేశాడు. వీరిద్దరి గొడవపై పోలీసులు విచారిస్తున్నారు.