https://oktelugu.com/

Iconic Actors: దిగ్గజ నటులతో పోలిస్తే.. కమలహాసన్ కు ఆ విషయంలో నిరాశే..!

Iconic Actors: వయస్సు పెరుగుతున్న కొద్ది తమ ఇమేజ్ ను పెంచుకుంటుపోయే నటులు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా  అరవై ఏళ్లు పైడిన హీరోలు బాక్సాఫీస్ వద్ద నేటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో 60ఏళ్లుపైబడిన హీరోలంతా కుర్రహీరోలకు సవాల్ విసురుతున్నారు. కుర్ర హీరోయిన్లతో డ్యూయట్స్.. ఫైట్స్.. రోమాన్స్ చేస్తూ తమలో ఇంకా స్టామీనా తగ్గలేదని నిరూపిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి హీరోలకు మనువలు, […]

Written By:
  • NARESH
  • , Updated On : December 10, 2021 / 02:40 PM IST
    Follow us on

    Iconic Actors: వయస్సు పెరుగుతున్న కొద్ది తమ ఇమేజ్ ను పెంచుకుంటుపోయే నటులు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా  అరవై ఏళ్లు పైడిన హీరోలు బాక్సాఫీస్ వద్ద నేటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో 60ఏళ్లుపైబడిన హీరోలంతా కుర్రహీరోలకు సవాల్ విసురుతున్నారు. కుర్ర హీరోయిన్లతో డ్యూయట్స్.. ఫైట్స్.. రోమాన్స్ చేస్తూ తమలో ఇంకా స్టామీనా తగ్గలేదని నిరూపిస్తున్నారు.

    Iconic Actors

    అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి హీరోలకు మనువలు, మనవరాళ్లు పుట్టినా కుర్ర హీరోలతో పోటీపడి నటించి మెప్పించారు. ఇప్పుడు ఆలోటును మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, విక్రమ్ లాంటి హీరోలు తీరుస్తున్నాయి. ఈ వియంలో మాత్రం లోకనాయకుడిగా కీర్తించబడుతున్న కమలాహాసన్ కు వెనుకబడే ఉండటం గమనార్హం.

    60ఏళ్ల వయస్సులో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ‘ఖైదీ-150’, ‘సైరా’లతో బాక్సాఫీసులను షేక్ చేసిన చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’లో నటిస్తూ బీజీగా ఉన్నాడు. ఫిబ్రవరిలో ‘ఆచార్య’ రిలీజు కానుండగా ‘భళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు బాబీలతో వరుస సినిమాలను చేస్తున్నారు. చిరంజీవి తాతయ్యగా ఎప్పుడో ప్రమోషన్ పొందారు. చిరంజీవి ఇద్దరు కూతుళ్లు సుప్రియ, శ్రీజలకు సంతానం కలుగగా చిరంజీవి తాతయ్య అయ్యారు.

    నందమూరి నటసింహం బాలకృష్ణ రీసెంట్ మూవీ ‘అఖండ’. ఈ మూవీ కరోనా సమయంలో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. గోపీచంద్ మాలినేని, అనిల్ రావుపూడిలతో వరుస సినిమాలను చేసేందుకు రెడీగా ఉన్నారు. బాలయ్య కూడా తాతగా ప్రమోషన్ పొందినవాడే. తమిళ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం తాతగా ఉంటూనే భారీ హిట్లను కొల్లగొడుతున్నారు. తాజాగా ‘అన్నాత్తే’ (పెద్దన్న) గా తమిళ, తెలుగు ప్రేక్షకులను పలకరించాడు రజనీ.

    Also Read: ఓ ఇంటివాడు కాబోతున్న ప్రభాస్​.. ఆ ప్రాంతంలో కోటలాంటి భవన నిర్మాణానికి ఏర్పాట్లు?

    తమిళ హీరో విక్రమ్ కూతురు సైతం నవంబర్ 10న ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో అతడు కూడా తాత లిస్టులో చేరిపోయాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, బిగ్ బీ అమితాబ్, కామెడీయన్ బ్రహ్మనందం తాతగా ఉంటూనే ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.

    లోకనాయుడు కమలాహాసన్ మాత్రం కేవలం సినిమాలతోనే సత్తా చాటుతున్నాడు. అతని ఇద్దరు కూతుళ్ళకు ఇంకా వివాహమే చేయలేదు. దీంతో ఇప్పట్లో అతడు తాత అయ్యే ఛాన్స్ లేదనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. నాగార్జున సైతం ఈ ఛాన్స్ మిస్ అయ్యాడు. నాగచైతన్య-సమంతలకు సంతానం ఉంటే నాగార్జున కూడా తాత అయ్యే వాడు. ఈ విషయంలోనే వారిద్దరికి మనస్పర్థలు వచ్చినట్లు గాసిప్స్ వచ్చాయి. కాగా వీరివురు ఇటీవల విడిపోవడంతో నాగార్జునకు ఆశ కూడా అడియాశే అయింది.

    Also Read: “సర్కస్ కార్ 2” చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన తేజస్వి మాదివాడ…

    Tags