Committee Kurrollu Movie Review : ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫుల్ మూవీ రివ్యూ

మొదటి నుంచి కూడా సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో రావడం దానికి తగ్గట్టుగా ఎడిటర్ కూడా చాలావరకు కష్టపడడం వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయిందనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : August 9, 2024 9:47 am

Committee Kurrollu Movie Review

Follow us on

Committee Kurrollu Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇచ్చి కొత్త కాన్సెప్ట్ లతో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగబాబు కూతురు అయిన నిహారిక ఫస్ట్ టైమ్ కమిటి కుర్రాళ్ళు అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ మన ముందుకు వచ్చింది. దర్శకుడు యద్ వంశీ గోదావరి జిల్లాల్లో ఉండే కొంతమంది కుర్రాళ్ళ కథని సినిమాగా మలిచాడు. ఈ సినిమా ఎలా ఉంది సక్సెస్ సాధించిందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే గోదావరి జిల్లాలోని ఒక ఊరులో 12 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. ఇక ఆ జాతరలో ఊరు మొత్తం పాల్గొని దాన్ని విజయవంతం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ జాతర తర్వాత ఎలక్షన్లు ఉంటాయి. అయితే ఈ ఎన్నికల వల్ల గత సంవత్సరంలో ఒక వ్యక్తి మరణిస్తాడు. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ గొడవలు జరగవచ్చనే అనుకున్న ఊరి పెద్దలు జాతరకి, ఎలక్షన్స్ కి మధ్య కొంచెం దూరం ఉండాలనే ఉద్దేశ్యంతో జాతర అయిపోయేంతవరకు ఎలక్షన్స్ కు సంబంధించిన టాపిక్ ని ఎవరు తీయకూడదని ప్రచారాలు కూడా నిర్వహించకూడదని ఒక తీర్పు ను ఇస్తారు… ఇక ఈ కమిటీ కుర్రోళ్ళు ఏం చేశారు గత ఎన్నికల్లో వ్యక్తి చనిపోవడానికి గల కారణం ఏంటి ఈ ఎలక్షన్లు ఎలా జరిగాయి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు యదు వంశీ సినిమా ప్లాట్ పాయింట్ ను చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశారనే చెప్పాలి. ఇక 2003 వ సంవత్సరం నాటి రోజులను రీ క్రియేట్ చేసి చూపించిన విధానం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అన్ని క్యారెక్టర్లలో ఒక ఇంటెన్స్ డ్రామాని బిల్డ్ చేయడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక మెలో డ్రామా ని పండించడంలో కూడా ఆయన చాలా వరకు సక్సెస్ సాధించడమే కాకుండా ఇది అతనికి మొదటి సినిమా అని చెప్పిన కూడా ఎవరు నమ్మలేని విధంగా సినిమాని డీల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది… ఇక మొత్తానికైతే ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా చూసినప్పుడు కొన్ని సీన్లు ప్రేక్షకుల చేత కంట తడి పెట్టిస్తాయి.

2003 -2004 సంవత్సరాల్లో ఉన్న యూత్ ఎలాంటి మెంటాలిటీ తో ఉన్నారు. ఎలాంటి హావాభావాలను పలికిస్తున్నారు లాంటి చాలా విషయాల్లో ఆయన అప్పటి రోజులను రీ క్రియేట్ చేశాడు… ఇక మొత్తానికైతే ఇదొక మంచి సినిమాగా నిలుస్తుంది…ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ అందించిన మ్యూజిక్ కూడా చాలా సెన్సిబుల్ గా ఉంది. కొన్ని సీన్లు ప్రేక్షకుల హృదయాలను పిండేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలావరకు హెల్ప్ చేశాడు… రిజర్వేషన్లు, కులాలకు సంబంధించిన విషయాలను కూడా చూపిస్తూ ఎక్కడా కూడా విమర్శలు అనేవి రాకుండా సెటిల్డ్ గా చూపించాడు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఉన్న నటి నటులందరూ చాలా బాగా నటించారు. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా హావభావాలను పలికిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ అయిన సాయికుమార్ కూడా సినిమాని మరొక మెట్టు పైకెక్కించడంలో ఆయన చాలా వరకు ప్రయత్నం చేశాడు…ఈ సినిమాలో అందరూ నటించారు. అనేకంటే ప్రతి ఒక్కరి తమ పాత్రలో జీవించారని చెప్పడం ఉత్తమం…దర్శకుడు ఏదైతే నమ్మాడో దాన్ని ఆర్టిస్టుల రూపంలో స్క్రీన్ ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో ఆయన చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాడు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దర్శకుడు ఏదైతే సినిమా చేయాలని అనుకున్నాడో ఆ స్టోరీ ని మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిదీప్ కి కూడా చాలా బాగా ఎక్కించాడు. దానివల్లే ఆయన ఇచ్చిన సాంగ్స్ గాని, బ్యాగ్రౌండ్ స్కోర్ గానీ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చిన కొన్ని మెలో డ్రామా సీన్స్ లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రాఫర్ విషయానికి వస్తే రాజు ఎడురోలు అందించిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలోని అందాలని తన కెమెరాతో చాలా బాగా చూపించాడు. ప్రతి సినిమాలో విజువల్స్ అనేవి చాలా కీలకపాత్ర వహిస్తాయి. కాబట్టి రాజు ఈ సినిమా కోసం తను ఎంచుకున్న షాట్స్ గాని, పెట్టిన బ్లాక్స్ గాని ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉన్నాయి… ఇక ఎడిటర్ ఈశ్వర్ అలీ చాలా సీన్స్ ఎడిట్ కట్ ఇచ్చాడు. ఇక ఆయన టైట్ గా ఎడిట్ చేయడం వల్లే సినిమా మీద చాలా ఆసక్తి అనేది పెరిగిందనే చెప్పాలి. మొదటి నుంచి కూడా సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో రావడం దానికి తగ్గట్టుగా ఎడిటర్ కూడా చాలావరకు కష్టపడడం వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయిందనే చెప్పాలి…

ప్లస్ పాయింట్స్

కథ
ఎమోషన్స్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్

మైనస్ పాయింట్స్

మొదట్లో కొంచెం స్లో గా అనిపిస్తుంది…
కొన్ని క్యారెక్టర్స్ ను ఇంకొంచెం బాగా వాడుకొని ఉంటే బాగుండేది…

రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్
యూత్ ఫుల్ స్టోరీస్ లో ఇదొక కొత్త తరహా సినిమా…