Comedian Yadamma Raju: బుల్లితెర ప్రేక్షకులకు యాదమ్మ రాజు పరిచయం అక్కర్లేని పేరు. పటాస్ షోతో యాదమ్మ రాజు వెలుగులోకి వచ్చాడు. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో ఈటీవీలో ప్రసారమైన ఈ షోలో యాదమ్మ రాజు తనదైన పంచ్లతో అలరించాడు. మెల్లగా బుల్లితెర షోలలో కామెడీ స్కిట్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ఏకంగా జబర్దస్త్ కమెడియన్ గా మారాడు. యాదమ్మ రాజు టీమ్ లీడర్ కూడాను. అందరి ముఖాల్లో నవ్వులు పూయించే యాదమ్మ రాజు జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
యాదమ్మ రాజు సోషల్ మీడియా పోస్ట్ ఆయన అభిమానులను కూడా విషాదంలో నిపించింది. యాదమ్మ రాజుకు చిన్నప్పటి నుండి విద్యాబుద్ధులు చెప్పిన గురువు కన్నుమూశారు. ఆయన పేరు డాక్టర్ ఫెడ్రిక్ ఫ్రాన్స్. యాదమ్మ రాజు బాల్యం నుండి ఆయనే చేరదీశాడట. పదవి తరగతి వరకు చదివించాడట. పితృ సమానుడైన గురువు మరణించడంతో యాదమ్మ రాజు ఎమోషనల్ అయ్యాడు.
ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు ఆయన నాకు చదువు చెప్పారు. నాకు మంచి చెడు నేర్పాడు. ఫీజులకు డబ్బులకు లేకపోతే ఆయనే చెల్లించాడు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన ఈ లోకాన్ని వీడటం విచారకరం అంటూ తన ఇంస్టాగ్రామ్ లో యాదమ్మ రాజు రాసుకొచ్చాడు. ఫెడ్రిక్ ఫ్రాన్స్ అంత్యక్రియల్లో పాల్గొన్న యాదమ్మ రాజు ఆయన పార్థివ దేహాన్ని మోశాడు.
తల్లిదండ్రులనే మర్చిపోతున్న పిల్లలు ఉన్న ఈ రోజుల్లో గురువు పట్ల యాదమ్మ రాజు చూపిన ప్రేమ, గౌరవాన్ని నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు. ఏమైనా యాదమ్మ రాజు గ్రేట్ అంటున్నారు. గురువు మరణానికి సంతాపం ప్రకటిస్తున్నారు. యాదమ్మ రాజుకు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. బ్రహ్మాజీ కొడుకు సంజీవ్ రావ్ హీరోగా ఇటీవల విడుదలైన స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీలో యాదమ్మ రాజు కీలక రోల్ చేశాడు. అతడి పాత్రలో వేరియేషన్ సినిమాకు ట్విస్ట్…
View this post on Instagram