https://oktelugu.com/

Sunil Wife: మీరు ఇంతకు వరకు ఎప్పుడు చూడని హీరో, కమీడియన్ సునీల్ ఫామిలీ ఫొటోస్ .ఇవే..!

Sunil Wife: టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో సునీల్ గురించి అందరికీ తెలుసు. వెండితెరపైన సునీల్ కనబడితే చాలు.. నవ్వులు పూయాల్సిందే అనేలా ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇకపోతే సునీల్ కమెడియన్‌గా ఉంటూనే పలు చిత్రాల్లో హీరోగానూ నటించాడు. ప్రజెంట్ నెగెటివ్ రోల్స్ కూడా ప్లే చేస్తున్నాడు. మెయిన్ విలన్‌గా ఈయన నటించిన చిత్రాలు సక్సెస్ అవుతున్నాయి కూడా. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో ‘మంగళం శ్రీను’గా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే […]

Written By: , Updated On : January 9, 2022 / 12:20 PM IST
Follow us on

Sunil Wife: టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో సునీల్ గురించి అందరికీ తెలుసు. వెండితెరపైన సునీల్ కనబడితే చాలు.. నవ్వులు పూయాల్సిందే అనేలా ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇకపోతే సునీల్ కమెడియన్‌గా ఉంటూనే పలు చిత్రాల్లో హీరోగానూ నటించాడు. ప్రజెంట్ నెగెటివ్ రోల్స్ కూడా ప్లే చేస్తున్నాడు.

Hero-sunil-family

Hero-sunil-family

మెయిన్ విలన్‌గా ఈయన నటించిన చిత్రాలు సక్సెస్ అవుతున్నాయి కూడా. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో ‘మంగళం శ్రీను’గా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు.

Sunil Family

Sunil Family

మొత్తంగా సునీల్ కమెడియన్ నుంచి హీరోగా, హీరో నుంచి విలన్ గా మారిపోయాడు. ఇకపోతే సునీల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బయటకు చెప్పడు. సునీల్‌కు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలుసు. ఈ సంగతులు అలా ఉంచితే.. సునీల్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులకే మ్యారేజ్ చేసుకున్నాడు. తమ బంధువుల అమ్మాయి అయిన శృతిని వివాహం చేసుకున్నాడు సునీల్. సునీల్ తన భార్య శృతి ఫొటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కాగా, తాజాగా ఆ ఫొటోలు ఎవరో షేర్ చేయగా, నెటిజన్లు వాటిని చూసి సునీల్ భార్య అందంగా ఉందని అంటున్నారు. సునీల్ శ్రుతి దంపతులకు ఒక బాబు, ఒక పాప సంతానం.

Comedian Sunil wife

Comedian Sunil wife

సునీల్ ఇండస్ట్రీలోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోగా, విలన్ గా రాణిస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో ‘మర్యాద రామన్న’ చిత్రంలో సునీల్ హీరోగా నటించాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నెగెటివ్ ప్లస్ కీ రోల్స్ ప్లే చేస్తూనే మెయిన్ హీరోగానూ చేస్తున్నారు.

Also Read: Ramesh Babu Death: చిన్న ఎన్టీఆర్ లా నటించిన రమేష్ బాబు.. ఆ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమయ్యాడు?

ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కథ అందిస్తున్న ‘వేదాంతం రాఘవయ్య’ చిత్రంలో సునీల్ హీరోగా నటిస్తున్నాడని తెలుస్తోంది. సునీల్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్ సీ 15లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తన చిత్రాల ద్వారా సొసైటీకి మెసేజ్ ఇచ్చే కథాంశంతో ఈ సారి వెరీ కాన్ఫిడెంట్‌గా శంకర్ పిక్చర్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Unmarried Actresses: 45 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి చేసుకోని ముదురు హీరోయిన్లు వీళ్లే..!

Tags