Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కాసేపటి క్రితమే రాజమండ్రి లో గ్రాండ్ గా మొదలైంది. ఈ ఈవెంట్ కి రెండు లక్షలకు పైగా అభిమానులు హాజరైనట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడిందట. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న సినిమా ఈవెంట్ కావడంతో ఈ రేంజ్ డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు విశ్లేషకులు. అంతే కాకుండా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ని ఒకే వేదిక మీద చూసి దాదాపుగా 7 ఏళ్ళు అయ్యింది. వీళ్లిద్దరి కలిసి చివరిసారిగా కనిపించింది ‘సై రా నరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే. మళ్ళీ ఇన్ని రోజులకు వీళ్లిద్దరు ఒకే వేదిక మీదకు రాబోతుండడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంతో రాష్ట్రం నలుమూలల నుండి ఈ ఈవెంట్ కి పాల్గొన్నారు.
ఇకపోతే కాసేపటి క్రితమే ఈ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ ప్రసంగించాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముందుగా ఆయన మైక్ అందుకోగానే జగన్ స్టైల్ లో మైక్ పై తట్టాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో. నేను కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇందులో రామ్ చరణ్ గారి నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం లో నాకు పూర్తి స్థాయి పాత్రని పోషించే అవకాశం దక్కింది. ఎస్ జె సూర్య పక్కనే ఉంటూ అతనిపై సెటైర్లు వేసే క్యారక్టర్ నాది. ఈ చిత్రం లో అనేక సన్నివేశాలు మన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నవి ఉంటాయి. భవిష్యత్తులో జరగబోయేవి కూడా ఉంటాయి. ఈ చిత్రం ముందుగానే విడుదల అయ్యుంటే ఆ పార్టీ కి 11 కూడా వచ్చేవి కాదు. సున్నా సీట్స్ వచ్చేవి’ అంటూ ఆయన ఎంతో ఉత్సాహంగా మాట్లాడాడు.
ఇక ఆ తర్వాత ఈ చిత్రం లో పని చేసిన నటీనటుల కళ్ళను చూపించి, ఇవి ఎవరెవరివో కనిపెట్టమని సుమ అడుగుతుంది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ అంజలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తుంది. కాసేపటి క్రితమే దిల్ రాజు కూడా వచ్చాడు. ఇక రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వచ్చేలోపు కచ్చితంగా 8 అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ముగించాలని అనుకున్నారు కానీ, విపరీతమైన జన సందోహం ఉండడం తో బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంధ్య థియేటర్ ఘటన ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా సెక్యూరిటీ విషయం లో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు.
Remember This #GameChanger pic.twitter.com/lq81AOsnPg
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) January 4, 2025