Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత వాడివేడిగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ముఖ్యంగా వైసీపీ పరభుత్వానికి మరియు జనసేన పార్టీ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాడు. ఇప్పట్లో ఈ హీట్ చల్లారే పరిస్థితులే కనిపించడం లేదు.
ఈ వారం లోనే ఎన్నికలు జరుగుతున్నాయా అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి ఆ రేంజ్ లో ఈ రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే జగన్ గతం లో ఒకానొక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన కొన్ని మాటలను గుర్తు చేసుకుంటూ కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియా లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 2019 ఎన్నికల వాతావరణం మొదలు అవ్వక ముందు జరిగిన ఇంటర్వ్యూ ఇది.
ఈ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ సప్పోర్టుని వైసీపీ పార్టీ కోరుతుందా అని యాంకర్ అడగగా దానికి జగన్ సమాధానం చెప్తూ ‘పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను బయట వ్యక్తిగతం గా ఎప్పుడూ కలవలేదు, ఆయన సినిమాలు కూడా నేను పెద్దగా చూసింది లేదు, అప్పుడెప్పుడో అందరూ బాగుంది అంటుంటే తొలిప్రేమ అనే సినిమా ఒక్కటే చూసాను. అయితే రాజకీయ పరంగా మాకు ఎవరి సపోర్టు అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ మాతో కలవడం వల్ల మాకు రూపాయి ఉపయోగం లేదు, చంద్ర బాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేస్తే వాళ్ళిద్దరికీ పెద్ద నష్టం జరుగుతుంది కానీ మాకు వచ్చిన నష్టం ఏమి లేదు’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ మాటల్లో మనం కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే జగన్ కి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమా తొలిప్రేమ అని.