CM Chandrababu Naidu : సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చి, ఆ తర్వాత క్యారక్టర్ రోల్స్ కి పరిమితమైన నటి పూనమ్ కౌర్(Poonam Kaur Lal). ఈమె సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ ని సంపాదించింది. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) పై, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లపై ఈమె ఇప్పటి వరకు పరోక్షంగా ఎన్నో సెటైర్లు వేస్తూ కనిపించింది. సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమె పేరు వింటేనే చిరాకు పడుతారు. ముఖ్యంగా కత్తి మహేష్ బ్రతికి ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన రచ్చ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ రచ్చ లో ఈమె కూడా ఒక భాగం అనుకోవచ్చు. ఇప్పటికీ కూడా సందర్భం దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఎదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది.
Also Read : మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభ తేదీని ప్రకటించిన సీఎం చంద్రబాబు!
అలా పవన్ కళ్యాణ్ కి పూర్తిగా వ్యతిరేక శక్తి గా పిలవబడిన పూనమ్ కౌర్ రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ని కలవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఎన్నో సార్లు పూనమ్ కౌర్ వైసీపీ కి సపోర్టుగా ట్వీట్స్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఆమెను ఎలా చంద్రబాబు నాయుడు కలిసాడు అంటూ పవన్ అభిమానులు చంద్రబాబు ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఒక ఈవెంట్ లో ఆమె అమరావతి ని గుర్తు చేసే చిత్రపటం ని చంద్రబాబు కి ఇస్తూ నవ్వుతూ కనిపించింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా షేర్ కూడా చేసుకుంది. ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనం గా మారింది. కేవలం పూనమ్ కౌర్ విషయం లోనే కాదు, టీడీపీ పార్టీ కి నచ్చని వాళ్ళు జనసేన పార్టీ లో ఉండడం, అదే విధంగా జనసేన కి నచ్చని వాళ్ళు టీడీపీ లో ఉండడం వంటివి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి జరుగుతూనే ఉన్నాయి.
ఉదాహరణకు ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీ కి చెందిన మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ పై ఏ రేంజ్ లో విరుచుకుపడ్డాడో మనమంతా చూసాము. కూటమి నిబంధనలను అతిక్రమించినందుకు అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలి, కానీ అది జరగలేదు, దీనిపై జనసేన పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అదే విధంగా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటే టీడీపీ వాళ్లకు ఎంత కోపమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, నాగబాబు, పందెం దొరబాబు వంటి వారు కూడా టీడీపీ పార్టీ శ్రేణులకు నచ్చరు. అయినప్పటికీ జనసేన పార్టీ లోనే కొనసాగుతున్నారు. ఇలా కూటమి లో ఉన్నప్పటికీ ఇరు పార్టీలకు నచ్చని కొన్ని సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.
Also Read : రూ.176 కోట్లతో కొత్త హెలికాప్టర్.. చంద్రబాబు.. లోకేష్ కోసం.. ఫుల్ క్లారిటీ!
Gifted a patachitra artwork which represents the essence of #amravati to none other than CM of Andhra Pradesh @ncbn #narachandrababunaidu garu
Jai hind pic.twitter.com/zevdfvs1ZD
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 18, 2025