https://oktelugu.com/

Big movies: థియేటర్ల మూసివేత.. పెద్ద సినిమాలపై ఎఫెక్ట్ ?

Big movies: ఏపీలో సమస్యలేవీ లేన్నట్లుగా జగన్ సర్కారు సినీ ఇండస్ట్రీపై దృష్టిసారించింది. ఇదేదో ఇండస్ట్రీని బాగుచేసేందుకు అనుకుంటే పొరపాటే. టాలీవుడ్ ను దారికి తెచ్చుకునేందుకే జగన్ సర్కార్ కక్ష్య పూరిత విధానాలకు తెరలేపుతుందనే వాదనలు ఏపీలో బలంగా విన్పిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ వర్సెస్ జగన్ సర్కార్ అన్నట్లుగా ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది. కరోనాతో నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలాంటి చర్యలు చేయకపోగా మరింత నష్టాన్ని కలిగించేలా చేస్తోంది. ప్రజలకు వినోదాన్ని తక్కువ ధరలో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2021 / 11:40 AM IST
    Follow us on

    Big movies: ఏపీలో సమస్యలేవీ లేన్నట్లుగా జగన్ సర్కారు సినీ ఇండస్ట్రీపై దృష్టిసారించింది. ఇదేదో ఇండస్ట్రీని బాగుచేసేందుకు అనుకుంటే పొరపాటే. టాలీవుడ్ ను దారికి తెచ్చుకునేందుకే జగన్ సర్కార్ కక్ష్య పూరిత విధానాలకు తెరలేపుతుందనే వాదనలు ఏపీలో బలంగా విన్పిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ వర్సెస్ జగన్ సర్కార్ అన్నట్లుగా ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది.

    Big movies

    కరోనాతో నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలాంటి చర్యలు చేయకపోగా మరింత నష్టాన్ని కలిగించేలా చేస్తోంది. ప్రజలకు వినోదాన్ని తక్కువ ధరలో అందిస్తామనే సాకుతో టాలీవుడ్ ను ఇబ్బందికి గురిచేస్తోంది. ఈక్రమంలోనే జగన్ సర్కార్ తన అధికార బలాన్ని టాలీవుడ్ పై ప్రయోగిస్తోంది. సినిమా యాక్ట్ చట్టంలో అనేక మార్పులు తీసుకొస్తూ టాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

    ఆన్ లైన్ టికెటింగ్ తోపాటు టికెట్ల రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దు వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని పరిశ్రమ ఆహ్వానించినప్పటికీ టికెట్ రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దుపై పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు, తొలి వారం టికెట్లు రేట్లు పెంచుకునే సదుపాయం ఉండేది. వీటివల్ల పెద్ద సినిమాలకు కొంత గిట్టుబాటు అయ్యేది.

    జగన్ సర్కారు టికెట్ల రేట్లను కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.250గా నిర్ణయించింది. సెంటర్ల వారీగా చూస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో థియేటర్ల నిర్వహాణ కష్టమనే భావనను యాజమాన్యాలు వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, సిబ్బంది జీతాలు, తదితర ఖర్చులు బాగా పెరిగిపోయాయని అందుకు తగ్గట్టుగా టికెట్ల రేట్లను నిర్ణయించాలని వారంతా కోరుతున్నారు.

    చిన్న సినిమాలకు ఓటీటీ బెస్ట్ ఆప్షన్ గా మారడంతో వారికి టికెట్ల రేట్లతో పెద్దగా ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు మాత్రం టికెట్ల ధరల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దుతో నష్టపోయే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు పెద్ద సినిమాలకు పైరసీ బెడద ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలోనే గతంలోలాగే తొలివారం టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలని ఇండస్ట్రీ పెద్దలు కోరుతున్నారు.

    Also Read: ఆ సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేయాలని ఉందంటున్న నాని… ఎవరంటే

    మరోవైపు ప్రభుత్వం థియేటర్ల యాజమనులు నిబంధనలను పాటించడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు, తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలోనే పలు థియేటర్లను సీజ్ చేయడం, లైసెన్సులను రద్దు చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో సినీ పెద్దలు జగన్ సర్కారుతో మరోసారి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని వారంతా కోరుతున్నారు.

    పెద్ద సినిమాలకు రిలీజుకు ముందే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి ప్యాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. ప్రభుత్వం థియేటర్ల విషయంలో మొండిగా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రభావం బడా సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ చర్యలు టాలీవుడ్ పరిశ్రమను దెబ్బతిసేలా ఉన్న నేపథ్యంలో సినీ పెద్దలు రంగంలోకి దిగి ప్రభుత్వంతో సయోధ్య చేసుకుంటేనే మంచిదని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ఇందులో ఎక్కువగా నష్టపోయేది ఇండస్ట్రీననే టాక్ విన్పిస్తోంది.

    Also Read: ప్రధాని మోదీతో మెగా పవర్ స్టార్ వైఫ్ ఉపాసన… కారణం ఏంటంటే