Daku Maharaj
Daku Maharaj : మన తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, అన్ని దేశాల్లోనూ మనకి మార్కెట్ రావడంతో, స్టార్ హీరోలు ఈమధ్య పాన్ ఇండియన్ సినిమాలు తప్ప, ప్రాంతీయ భాష చిత్రాల జోలికి వెళ్లడం లేదు. కానీ మార్కెట్ ఏర్పడింది కదా అని ఈమధ్య ప్రతీ ఒక్కరు పాన్ ఇండియా అంటూ ఎగబడుతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఒక సినిమాకి గుర్తింపు రావాలంటే, అందులో ప్రత్యేకమైన ఎలిమెంట్స్ కొన్ని ఉండాలి. అవి లేకపోతే అసలు చూడరు. అయినప్పటికీ కూడా ఈమధ్య కొంతమంది నిర్మాతలు హిందీ లోకి దబ్ చేసి విడుదల చేస్తున్నారు. అలా రీసెంట్ గా విడుదలైన ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని హిందీ లోకి దబ్ చేసి విడుదల చేసారు. కానీ అక్కడ దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదట.
గతంలో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘అఖండ’ ని కూడా హిందీ లో దబ్ చేసి విడుదల చేసారు. దానికి కూడా ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది. దేవుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమానే అక్కడి ఆడియన్స్ పట్టించుకోలేదంటే, ఇక మామూలు మాస్ సినిమాని ఎలా చూస్తారని అనుకున్నారో ఏమిటో తెలియదు కానీ, ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని హిందీ లో విడుదల చేసి బాలయ్య బాబు పరువు తీసినంత పని చేసాడు నిర్మాత నాగవంశీ. ఈ చిత్రాన్ని హిందీ లో దబ్ చేసి విడుదల చేయడానికి రెండు కోట్ల రూపాయిల ఖర్చు అయ్యింది. కనీసం ఆ రెండు కోట్లు రాబట్టి ఉన్నా సంతృప్తి గా ఉండేదేమో, కనీసం కోటి రూపాయిల గ్రాస్ ని కూడా రాబట్టలేకపోయింది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. ‘డాకు మహారాజ్’ చిత్రానికి మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది కానీ, వసూళ్లు అనుకున్న స్థాయిలో లేవు.
మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ దక్కింది, ఆ తర్వాత పండగ సెలవుల్లో కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యాయి, కానీ ఆ తర్వాత మాత్రం ఊహించని రీతిలో డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో తప్ప, ఏ ప్రాంతంలో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి నోచుకోలేదు. ఓవర్సీస్ లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది కానీ, నార్త్ అమెరికా లో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. సంక్రాంతి సీజన్ లో బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకున్న ఒక సినిమాకి ఇంత తక్కువ వసూళ్లు రావడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. వెంకటేష్ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి యూత్ ఆడియన్స్ వరకు ప్రతీ ఒక్కరూ ఆ సినిమాకే క్యూలు కట్టడం వల్ల ‘డాకు మహారాజ్’ పై ఎఫెక్ట్ పడిందని అంటున్నారు.