https://oktelugu.com/

Climax Twist Of Acharya: ఆచార్య మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ ఇదేనా.. అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం

Climax Twist Of Acharya: మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఎట్టకేలకు ఎన్నో వాయిదాల తర్వాత ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్రలో కనిపించిన ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవలే విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..చిరంజీవి మరియు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 22, 2022 / 01:48 PM IST
    Follow us on

    Climax Twist Of Acharya: మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఎట్టకేలకు ఎన్నో వాయిదాల తర్వాత ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్రలో కనిపించిన ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవలే విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఉన్న షాట్స్ ని చూసి వాళ్ళు ఎంతగానో మురిసిపోయారు..వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఒక్క పాట ని కూడా ఇటీవలే విడుదల చెయ్యగా దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇక ఈ సినిమాలో సిద్ద క్యారక్టర్ ని డైరెక్టర్ కొరటాల శివ గారు అద్భుతంగా డిసైన్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈ పాత్ర రామ్ చరణ్ కెరీర్ లో చిరస్థాయిగా గుర్తు ఉండిపొయ్యే క్యారెక్టర్స్ లో ఒక్కటిగా నిలిచిపోతుంది అని ఇటీవలే రామ్ చరణ్ ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపాడు.

    Acharya

    మొదట స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కేవలం సిద్ద అనే పాత్ర నిడివి కేవలం 25 నిముషాలు మాత్రమే అట..కానీ అభిమానులను దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ గారు ఆ పాత్రను నిడివి ని 45 నిమిషాల వరుకు ఉండేలా తీర్చి దిద్దినట్టు సమాచారం..ప్రీ ఇంటర్వెల్ నుండి వచ్చే రామ్ చరణ్ పాత్ర సెకండ్ హాఫ్ మధ్యలో వరుకు ఉంటుంది అని..ఆ తర్వాత సినిమాలో విలన్స్ చేసే కుట్రల వల్ల ఆ పాత్ర చనిపోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..కానీ లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏమిటి అంటే..ఈ సినిమా క్లైమాక్స్ లో అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోయ్యే రేంజ్ ట్విస్ట్ ని కొరటాల శివ పెట్టినట్టు తెలుస్తుంది..అందరూ రామ్ చరణ్ సిద్ద పాత్ర చనిపోయింది అని అనుకుంటూ ఉన్న సమయం లో క్లైమాక్స్ లో సడన్ గా ఆ పాత్ర మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది అని..అలా రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి క్లైమాక్స్ లో విలన్స్ తో చేసే ఫైట్ అభిమానులను సీట్స్ మీద కూర్చునేలా చెయ్యదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

    Also Read: Kajal Aggarwal: దాన్ని అనుభవించి తీరాలంతే.. ఎమోషనలైన హీరోయిన్ !

    ఇదే కనుక నిజం అయితే అభిమానులు థియేటర్స్ లో పూనకాలు వచ్చి ఊగిపోతారు అని చెప్పాలి..ఒక్క ముఖ్య పాత్ర గా అనుకున్న రామ్ చరణ్ సిద్దా క్యారక్టర్ ని ఒక్క పూర్తి స్థాయి పాత్ర గ మలిచి ఒక్క మెగా మల్టీస్టార్ర్ర్ సినిమాగా ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇక ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..సినిమా కథ ఆయన వాయిస్ ఓవర్ తోనే ప్రారంభం అవుతుంది అని తెలుస్తుంది..ఇక అతి ముఖ్యమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 23 వ తారీఖున హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరగబోతుంది..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు..ఈ ఈవెంట్ లో వీళ్ళందరూ ఏమి మాట్లాడుతారా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

    Also Read: Bharat Biotech Covaxin: రెండేండ్లు నిండిన పిల్ల‌ల‌కు ఆ టీకా.. .. నివేదిక స‌మ‌ర్పించిన భార‌త్ బ‌యోటెక్‌..

    Recommended Videos:

    Tags