NTR And Prashanth Neel: 18 సంవత్సరాలకే హీరోగా అవతరించిన జూనియర్ ఎన్టీఆర్ 19 సంవత్సరాల వయసులో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు.గొప్ప నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. అయినప్పటికి ఆయన ఇండస్ట్రీ హిట్టు మాత్రం సాధించలేకపోతున్నాడు. దానివల్ల ఆయన చాలా వరకు వెనకబడి పోతున్నాడు. ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన, ఎవరికి ఎలాంటి సక్సెసులు దక్కిన కూడా కలెక్షన్స్ పరంగా మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ డమ్ దక్కుతోంది. ఇక దాన్నిబట్టి హీరోల మార్కెట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ హిట్ సినిమాలైతే ఉన్నాయి. ఒక జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఇప్పటివరకు ఇండస్ట్రీ హిట్ సినిమా పడలేదు.
దాంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా వస్తుందట. ప్రశాంత్ నీల్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాని చాలా కేర్ఫుల్ గా చేస్తున్నాడట. అలాగే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి ఈ సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కొత్త గెటప్ లో కనిపిస్తాడట.
ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడనే విషయం క్లైమాక్స్లో రివిల్ చేస్తారట. అలాగే అక్కడ పెద్ద ఫైట్ సిక్వెన్స్ జరుగుతోందట. ఆ గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ కి ‘సలార్ 2’ కనెక్షన్ ను కూడా కలుపబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న డ్రాగన్ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
దానికోసం ఒక డిఫరెంట్ లుక్ కావాలనే ఎన్టీఆర్ ని చాలావరకు సన్నబడమని ప్రశాంత్ నీల్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ సైతం కొత్త లుక్ లోనే ఉన్నాడు. ఇక ఆ లుక్ లో ఎన్టీఆర్ మెస్మరైజ్ చేస్తాడా? ప్రేక్షకులను మెప్పించగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…