Homeఎంటర్టైన్మెంట్Sudha Chandran: మోడీకి సీనియర్‌ నటి సుధా చంద్రన్ రిక్వెస్ట్... వైరల్ గా మారిన పోస్ట్

Sudha Chandran: మోడీకి సీనియర్‌ నటి సుధా చంద్రన్ రిక్వెస్ట్… వైరల్ గా మారిన పోస్ట్

Sudha Chandran: ప్రముఖ నటి, నాట్య కారిణి సుధా చంద్రన్‌ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. రోడ్డు ప్రమాదంలో ఆమె ఒక కాలుని కోల్పోయిన కానీ… ఆ స్థానంలో కృత్రిమ పాదాన్ని అమర్చుకొని డాన్సర్‌ గానూ కృత్రిమ పాదంతో అనేక షోలను నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఇప్పటికే డాన్స్‌ షోలతో పాటు నటిగానూ రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ప్రధాని మోడీని రిక్వెస్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

classical dancer sudha chandran request to pm modi about airport checking issue

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బోజ్‌పూరి, మరాఠి ఇలా అనేక భాషల్లో నటించారు. సినిమాలే కాదు సీరియల్స్ లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుధా చంద్రన్‌.  తెలుగులో నృత్య ప్రధానంగా వచ్చిన `మయూరి` చిత్రంతో జాతీయ అవార్డుని, నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది.

అయితే కృత్రిమ అవయవం ధరించి ఎయిర్‌పోర్ట్ కి వెళ్లినప్పుడు తమకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయట. చెకింగ్‌ కోసమని ప్రతిసారి ఆ కృత్రిమ పాదాన్ని తీయాల్సి వస్తుందని… అధికారులు ఆ విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు వాపోయారు సుధా చంద్రన్‌. దీంతో ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేస్తుంది. కృత్రిమ అవయవంతో డాన్సు చేసి చరిత్ర సృష్టించిన నేను ఈ దేశం గురించి గర్వపడుతున్నాను.

కానీ  నేను నా ప్రొఫేసనల్ విజిట్‌లకు వెళ్లిన ప్రతిసారీ, విమానాశ్రయాల్లోనే నన్ను ఆపేస్తున్నారు. దయజేసి నా కృత్రిమ అవయవం కోసం ఈటీడీ (ఎక్స్ ప్లోసివ్‌ ట్రేస్‌ డిటెక్టీవ్‌) చేయమని సెక్యూరిటీ వద్ద అభ్యర్థించినప్పటికీ వాళ్లు నన్నుప్రతిసారి ఆ అవయవాన్ని తీసేయాలని కోరుతున్నారు. ఇది మానవీయంగా సాధ్యమేనా మోడీజీ… ఇదేనా మనం దేశం గురించి మాట్లాడుతోంది. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా… దయజేసి సీనియర్‌ సిటిజన్లకి `సీనియర్‌ సిటిజన్` అని చెప్పే కార్డ్ ఇవ్వండి` అని అభ్యర్థించింది సుధా చంద్రన్‌.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version