Homeఎంటర్టైన్మెంట్Colors Swathi Divorce: కలర్స్ స్వాతి విడాకులపై వచ్చిన క్లారిటీ?

Colors Swathi Divorce: కలర్స్ స్వాతి విడాకులపై వచ్చిన క్లారిటీ?

Colors Swathi Divorce: ఈ మధ్య విడాకులు రూమర్స్ ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీలకు సంబంధించిన ఎలాంటి రూమర్ వచ్చిన సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటుంది. సమంత, నాగచైతన్య, శ్రీజ, నిహారికల విడాకుల వ్యవహారాలు ఎంత హాట్ టాపిక్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరందరి ఇష్యూలు కూడా విడాకులకు సంబందించినవే.. ఇదే విధంగా గత కొంత కాలంగా కలర్స్ స్వాతి విడాకుల ఇష్యూలు కూడా బయటకు వస్తుంది. ఇంతకీ విడాకులు తీసుకున్నారా? లేదా కలిసి ఉన్నారా అనుకుంటున్నారా. ఆమెనే ఓ క్లారిటీ ఇచ్చేసింది. మరి ఆలస్యం ఎందుకు ఒకసారి చూసేయండి…

ఒకప్పుడు టీవీ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా చేసి..సినిమాల్లో హీరోయిన్‌గా, హీరోయిన్ సపోర్ట్ క్యారెక్టర్‌లు చేసిన కలర్స్ స్వాతి వైవాహిక జీవితానికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె తన భర్త నుంచి విడిపోయిందని నెట్టింట బోలెడన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. అప్పటినుంచి కలర్స్ స్వాతి విడాకుల వ్యవహారం జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది కలర్స్ స్వాతి.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న కలర్స్ స్వాతి.. ఇటీవల సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సోల్ ఆఫ్ సత్య పేరుతో ఓ ఆల్బమ్ చేసి ఇప్పుడు మంత్ ఆఫ్ మధు సినిమాతో వెండితెరపై సందడి చేయబోతుంది. ఇందులో స్వాతికి జంటగా నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం హైదరాబాద్‏లో ప్రెస్ మీట్ నిర్వహించగా.. మీడియా వర్గాలు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలిచ్చింది కలర్స్ స్వాతి. ఈ క్రమంలోనే తన విడాకుల ఇష్యూపై రియాక్ట్ అయింది.

తన డివోర్స్ విషయంలో వస్తున్న వార్తలపై ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. దీనిపై అస్సలు రియాక్ట్ కాను అంటూ సూటిగా చెప్పేసింది కలర్స్ స్వాతి. ఓ నటిగా తనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయని, అందుకే విడాకుల గురించి చెప్పను అనేసింది. అంతేకాదు కలర్స్ ప్రోగ్రామ్ చేస్తున్న సమయంలో తనకు కేవలం పదహారేళ్లు మాత్రమేనని… అప్పట్లో సోషల్ మీడియా లేదని. ఒకవేళ అప్పుడు సోషల్ మీడియా ఉంటే నన్ను ఫుట్ బాల్ ఆడేసేవారేమో అంటూ ఫన్నీగా స్పందించింది ఈ భామ. కానీ తీసుకుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే అసలు దీనిమీద స్పందించాల్సిన అవసరమే లేదంటే.. అదొక ఫేక్ అని అలాంటి వాటి గురించి స్పందించడం కూడా వేస్ట్ అన్నట్టుగా మాట్లాడడంతో కలర్స్ స్వాతి విడాకుల ఇష్యూ జస్ట్ పుకారు మాత్రమే అంటున్నారు ఆమె మాటల్లో అంతరార్థం తెలిసినవారు.

2018లో వికాస్‌ వాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కలర్స్ స్వాతి. ఆ తర్వాత భర్త జాబ్ రిత్యా సినిమాలకు దూరమై విదేశాల్లో కాపురం పెట్టింది. ఆ టైమ్‌లో తన అప్‌డేట్స్‌, ఫ్యామిలీ జర్నీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది స్వాతి. రీసెంట్‌గా కలర్స్‌ స్వాతి విదేశాల నుంచి ఇండియాకు వచ్చింది. తెలుగులో పంచతంత్ర మూవీలో కూడా యాక్ట్ చేసింది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త వికాస్ వాసు ఫోటోలు డిలీట్ చేయడంతో వీరిద్దరి పెళ్లి వ్యవహారం విడాకులకు దారి తీసిందా అనే అనుమానాలు షురూ అయ్యాయి. వాళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, అందుకే ఆమె ఇండియాకు వచ్చిందని ఈక్రమంలోనే డైవర్స్‌ కూడా తీసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి చూడాలి తర్వాత ఏం జరగనుందో…

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular