Sai Pallavi- Pushpa 2: పుష్ప సినిమా సృష్టించినంత ప్రభంజనం మరే చిత్రం సృష్టించలేదు. క్రికెటర్లతోనూ స్టెప్పులేయించిన ఈ సినిమా, తర్వాత ఓటీటీలోనూ విజయ దుందుభి మోగించింది. అందుకే ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘పుష్ప 2’ భారీగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ ఈసారి సీక్వెల్ కోసం చాలా గ్రాండ్ గా, వినూత్నమైన కథాకథనాలను సిద్ధం చేశాడు. ఈ క్రమంలోనే బన్నీ క్యారెక్టర్ కి జోడిగా మరో క్యారెక్టర్ ను తీసుకొస్తున్నాడు. అయితే, ఆ క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నారో తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పుష్ప సినిమాలో బన్నీ సరసన నటించబోతుంది.
ఇప్పటికే సాయి పల్లవికి దర్శకుడు సుకుమార్ ఆమె క్యారెక్టర్ ని నేరేట్ చేశాడు. నేచురల్ క్యారెక్టర్ కావడంతో సాయిపల్లవి కూడా ఓకే చెప్పింది. పైగా తన పాత్రకు తానే కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేసుకుంటుంది. ఇక తన పాత్ర కోసం ఆమె చిత్తూరు యాస కూడా నేర్చుకుంటుంది. అన్నట్టు సాయిపల్లవి ని ఈ సినిమాలో మన్యం బిడ్డగా చూపించబోతున్నారట.
Also Read: Favorite Foods of Tollywood Heroes: మెగాస్టార్ నుంచి అల్లు అర్జున్ వరకు వారికిష్టమైన ఆహారపదార్థాలు
మొత్తానికి పుష్ప 2 కోసం భారీ కసరత్తులు చేస్తున్నారు సుకుమార్ బ్యాచ్. అందుకే, ఓటీటీ సంస్థలు కూడా పుష్ప 2 కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో డిజిటల్ రైట్స్ విషయంలోనూ ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి. మొత్తానికి పుష్ప 2 కి భారీగా డిమాండ్ ఉంది. పైగా తమిళ హీరో విజయ్ సేతుపతి పుష్ప 2లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. నిజానికి పుష్ప పార్ట్ 1 లోనే విలన్ గా విజయ్ సేతుపతినే నటించాల్సింది.
విజయ్‌నే మొదట భన్వర్‌లాల్ షెకావత్ పాత్ర కోసం అనుకున్నారు. విజయ్ డేట్స్ సర్టుబాటు కాలేదు. ఆ తర్వాత మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ను ఈ పాత్రకు తీసుకున్నారు. ఐతే.. పుష్ప 2 స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా పుష్ప 1 కంటే పుష్ప 2లో యాక్షన్ ను ఫుల్ పెడుతున్నాడు సుక్కు. కాకపోతే, భారీ అంచనాలు అందుకోవడం అంత ఈజీ కాదు.
అందుకే, పుష్ప టాక్ విషయంలో మొదట కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏది ఏమైనా పార్ట్ 1 అంచనాలను అందుకుంది. అందుకే, పార్ట్ 2 పై రెట్టింపు ఆసక్తి కలిగింది. ఇక పార్ట్-1లో ఉన్న పాత్రలే పార్ట్-2లో కూడా ఉంటాయి. అలాగే పార్ట్ 2లో మరో 3 కొత్త పాత్రలు యాడ్ అవుతాయి. అలాగే పార్ట్ 2లో ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపాన్ని చూస్తారని సుకుమార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.