కరోనా లాక్ డౌన్ మొదలయ్యాక ప్రజలు ఇబ్బందుల్లో వుంటే సినిమా వాళ్లే అందరి కన్నా ముందుగా స్పందించారు. కానీ 
ఈ కరోనా కష్ట కాలంలో ప్రజలు సినిమాల పట్ ల ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కూడా సినిమా లాస్ట్ ఆప్షన్ అని అనుకొంటోంది. దాంతో లాక్ డౌన్ నుంచి బయట పడ్డా కానీ సినిమా షూటింగ్స్ కి అనుమతి రాదని అర్థమౌతోంది .
అందుకే లాక్ డౌన్ తీసివేసిన తర్వాత నిర్మాణంలో ఉన్న సినిమాలకు షూటింగ్ చేసుకొనే అవకాశం ఇస్తే చాలని సినీ పరిశ్రమ భావిస్తోంది. కొత్త గా ప్రారంభం కాబోయే సినిమాలను మాత్రం పరిస్థితులు మామూలు అయ్యేంతవరకు ఆపాలని అనుకొంటున్నారు. ఇపుడు షూటింగ్ జరుపుకొంటున్న పెద్ద సినిమాలు మళ్ళీ మొదలైతే వందల మంది జూనియర్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. ఆ క్రమం లో పెద్ద సినిమాలకి షూటింగ్ చేసే ఛాన్స్ ఉండక పోవచ్చు . సింపుల్ గా లోబడ్జట్ లో తీసే సినిమాలకు షూటింగ్ చేసుకొనే ఛాన్స్ రావచ్చు. అలాగే సినిమా థియేటర్ లకు కూడా ఇప్పట్లో ప్రదర్శనకు అనుమతులు లభించక పోవచ్చు .. సినిమా థియేటర్స్ పూర్వం లా రన్ అయ్యే వరకు `ఓటిటి ప్లాటుఫామ్` లలో చిన్న చిత్రాలు రిలీజ్ చేయక తప్పేలా లేదు. అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతే సినిమా థియేటర్ లు పూర్వంలా కళకళ లాడాలంటే రెండేళ్లు పైగానే పడుతుందని అన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు .
ఇక కొంత భాగం షూటింగ్ పూర్తి చేసు కొన్న ” ఆర్.ఆర్.ఆర్.”, ” ఆచార్య”, “ప్రభాస్ సినిమా”, “పుష్ప”, “మహేష్ బాబు, పరశురామ్ కాంబో సినిమా” ,” పవన్ కళ్యాణ్ ,క్రిష్ కాంబో మూవీ ” లాంటి భారీ చిత్రాలు ఇప్పట్లో సెట్స్ మీదకి వెళ్లడం సాధ్యం అయ్యేలా లేదు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ వచ్చే సంవత్సరంలో గాని మోక్షం పొందవు. .