Cinema Viral : సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు సంక్రాంతికి అలరించాడు. ఈక్రమంలో ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అక్కినేని అభిమానులు మెచ్చుకోగా, ఇక జీ5లో కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి జీ 5లో బంగార్రాజుని చూడొచ్చు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతిజింటా ఈ సారి ఐపీఎల్ మెగా వేలానికి అందుబాటులో ఉండటం లేదు. ఇంతకుముందు ఎప్పుడు వేలం జరిగినా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమె ఈ మధ్యనే సరోగసి ద్వారా పండంటి బిడ్డకు తల్లయింది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నా బిడ్డను వదిలిరాలేను. వాడి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వేలానికి దూరంగా ఉంటున్నా’ అని ఇన్‌స్టాలో పేర్కొంది.
Also Read: ఆ సీఎం నినాదాన్ని వాడేస్తున్న రేవంత్.. సక్సెస్ అవుతుందా…?

అలాగే మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే.. యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇవాళ ఆమె యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కాలంలో ఎవరికి దక్కని అవకాశం సీఎం కేసీఆర్‌కు లభించిందన్నారు. గతంతో పోలిస్తే వైభవంగా ఆలయ పునర్ నిర్మాణం చేశారని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయ నిర్మాణం జరిగిందన్నారు.
యాదాద్రి ఆలయ నిర్మాణం అద్భుతం: ఎమ్మెల్యే రోజా

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. మహేష్ అభిమానులకు జాతర షురూ అయింది. ఇక నుండి సర్కారు వారి పాట అప్‌డేట్స్ ఉంటాయని ఇటీవలే కళావతి పాటను అనౌన్స్ చేయగా, ఇందుకు సంబంధించిన ప్రోమోని వదిలారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో మహేష్ సూపర్ స్టైలిష్‌గా కనిపించగా, తమన్ సంగీతం హుషారుగా సాగింది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ పాట విడుదలవుతోంది. అయితే.. ప్రస్తుతం ఈ గ్లింప్స్ బాగా వైరల్ అవుతుంది.
Also Read: అప్పటి ముచ్చట్లు : ఆ మాటలు విని గుమ్మడి గారు ఆశ్చర్యపోయారు !
[…] Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్రాంచైజీలు కూడా ఆటగాళ్ల వేలం నేటి నుంచి చేపడుతున్నారు. దీంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కొనుగోలులో నిమగ్నమైతే హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం ఏ ఆటగాడిని కొనుగోలు చేయకపోవడం గమనార్హం. దీంతో అభిమానులు ఫ్రాంచైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిర్వాహకుల ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. […]
[…] IPL Auction: ఐపీఎల్ అంటే మన దేశంలో పెద్ద పండగ సీజన్ లాంటిది. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఐపీఎల్‌కోసం ఈరోజు మెగా వేళం జరుగుతోంది. రేపు కూడా వేళం ఉంటుంది. కాగా ఇందులో చాలామంది ఆటగాళ్లు భారీ స్థాయిలో అమ్ముడు పోగా.. స్టార్ క్రికెటర్లు కొందరు మాత్రం అమ్ముడుపోకపోవడం విచిత్రంగా ఉంది. తొలి రౌండ్ లో వారు అమ్ముడు పోలేదు. వారెవరో ఇప్పుడు చూద్దాం. […]