Telugu star heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాటపడుతున్నారు. నిజానికైతే ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు స్టోరీస్ సెలక్షన్ లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించే విధంగా స్టోరీని రాయించుకొని మరి సినిమాలు చేస్తున్నారు. అలాగే యంగ్ హీరోలు కూడా ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా బాటపడుతున్నారు. అయితే కొంతమంది స్టార్ హీరోలు మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ వాళ్లకి అక్కడ మంచి క్రేజ్ అయితే ఉంది. ఇంతకీ ఆ హీరోలు ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు… వీళ్ళిద్దరు పాన్ ఇండియా సినిమాలని చేయకపోయినా కూడా వీళ్ళకి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.ఇక పవన్ కళ్యాణ్ సుజీత్ తో చేస్తున్న ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయింది అంటే అందరూ పవర్ స్టార్ అభిమానులుగా మారిపోతారు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన ప్రజాసేవలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడప్పుడే షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అంటూ అతని అభిమానులతో పాటు సినిమా దర్శకుడు అయిన సుజీత్ కూడా చాలా వరకు కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు…
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇప్పటివరకు ఫ్యాన్ ఇండియాలో ఒక సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వం డైరెక్ట్ ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు దీంతో ఇటు ఇండియాలను అటు వరల్డ్ స్థాయిలోను ఆయన పేరు మారు మ్రోగిపోతుందని చెప్పాలి ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అంటే మహేష్ బాబు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది…
ఇక వీర్లే కాకుండా నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లాంటి హీరోలు కూడా ఇప్పటివరకు ఫ్యాన్ ఇండియాలో ఒక సినిమా కూడా చేయలేదు ఇంకా చిరంజీవి సైరా సినిమాతో పేరెంజ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురయింది మరోసారి విశ్వం ప్రసన్నతో వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు…