Rajinikanth, Chiranjeevi and Kamal Haasan : సౌత్ లో పాలిటిక్స్ కి సినిమా ఇండస్ట్రీ తో అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి. ఇప్పటివరకు ఎవరికీ దక్కని అదృష్టం సౌత్ సినిమా హీరోలకు మాత్రమే దక్కుతుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా రాణించిన ఎన్టీఆర్, ఎం జి ఆర్ లాంటి నటులు సీఎంలుగా మారడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఇలాంటి అద్భుతాలు జరిగాయి. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ని వాడుకుంటూ హీరోలు రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో రాజకీయ ప్రవేశం చేసి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తనదైన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తమిళ్ నాడు లో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గిజ నటులు పాలిటిక్స్ లోకి రావాలని అనుకున్నారు. ఇక రజినీకాంత్ పాలిటిక్స్ ఎంట్రీ ఇవ్వకపోయిన కూడా కమల్ హాసన్ మాత్రం పాలిటిక్స్ లోకి వచ్చాడు. కానీ ఆయన పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు.ఇక చిరంజీవి కూడా రాజకీయంగా రాణించలేక పోయారు… ఇక వీళ్ళను చూసి కూడా ఇప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే మాస్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఇళయ దళపతి కొత్త పార్టీని పెట్టి రాజకీయ ఎంట్రీ ఇచ్చాడు. మరి ఆయన ఏ విధంగా తమిళనాడు రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయబోతున్నాడు.
ప్రజలు విజయ్ ని నమ్మి అతనికి ఓట్లు వేసే అవకాశం ఉందా తమిళనాడులో ఇప్పటికే పాతుకుపోయిన స్టాలిన్ ఫ్యామిలీని ఢీ కొట్టి మరి విజయ్ సీఎంగా ఎదుగుతాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్తతో పాలిటిక్స్ లోకి వచ్చిన విజయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ లో చేసినట్టుగానే విజయ్ కూడా తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనాలను సృష్టించబోతున్నాడా?
ఎందుకు విజయ్ తనదైన రీతిలో పాలిటిక్స్ లోకి రావాలని అనుకున్నాడు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన సీఎం పదవిని కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తను సీఎం అయితేనే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో ఆయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అని కూడా ఒకానొక సందర్భంలో తెలియజేశాడు. ఇక మొత్తానికైతే ఆయన రీసెంట్ గా పెట్టిన సభ భారీ ఎత్తున సక్సెస్ అయింది.
ఇక దాంతో మిగితా పార్టీలన్నీ భయంతో వణికిపోతున్నాయనే చెప్పాలి. మరి ఇప్పుడు విజయ్ రాజకీయ రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా? లేదా అక్కడి లోకల్ రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడలో విజయ్ సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…