https://oktelugu.com/

ట్రైలర్ తో ఆకట్టుకున్న ‘సినిమా బండి’ !

తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే ‘సినిమా బండి’ నిర్మాణంలో ఒక సరికొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. ప్రవీణ్ కాండ్రేగుల అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ అతని దర్శకత్వంలో సినిమా బండి అనే ఫుల్ ఇన్నోసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేసాడు. తాజాగా సినిమా ట్రైలర్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. సినిమాలోని అమాయక పాత్రల చుట్టూ అల్లుకున్న కామెడీ చాల బాగా ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ లో ప్రస్తావించిన […]

Written By:
  • admin
  • , Updated On : April 30, 2021 / 04:22 PM IST
    Follow us on

    తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే ‘సినిమా బండి’ నిర్మాణంలో ఒక సరికొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. ప్రవీణ్ కాండ్రేగుల అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ అతని దర్శకత్వంలో సినిమా బండి అనే ఫుల్ ఇన్నోసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేసాడు. తాజాగా సినిమా ట్రైలర్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. సినిమాలోని అమాయక పాత్రల చుట్టూ అల్లుకున్న కామెడీ చాల బాగా ఆకట్టుకుంటుంది.

    ఇక ట్రైలర్ లో ప్రస్తావించిన ముఖ్య అంశం సినిమాలు చూస్తూ పెరిగిన ఎవరైనా సినిమా తీయొచ్చు అనే కోణంలో సాగిన ఈ కథ అద్భుతంగా ఉంది. కాగా సినిమా తీయడం కోసం ఇద్దరు ఇన్నోసెంట్ యువకులు చేసిన నిజాయితీ ప్రయత్నాలు ఫుల్ గా నవ్విస్తాయి. బాలీవుడ్ దర్శకుల ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డికె మొదటిసారి నిర్మాతలుగా ఈ సినిమా తీస్తుండటంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

    అయినా ఒక షేర్ ఆటో డ్రైవర్ కు ఖరీదైన కెమెరా దొరకడం, ఆ కెమెరాతో ఆటో డ్రైవర్, అతనిపాటు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి సినిమా తీయాలనుకోవడం.. ఈ క్రమంలో హీరోహీరోయిన్లును వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం, మొత్తానికి అమాయకమైన పల్లెటూరి వ్యక్తులు తమ అతి తెలివితో దొరికిన కెమెరాతో చేసే ప్రయోగాలు బాగున్నాయి. కామెడీతో పాటు ఈ సినిమాలో డైలాగులు కూడా బాగా నవ్విస్తున్నాయి. ఇక ఈ ‘సినిమా బండి’ మే 14న నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం అవ్వనుంది.