https://oktelugu.com/

చిరంజీవి గొప్ప మనసుకు సినీ కార్మికుల కృతజ్ఞతలు

మెగా స్టార్ చిరంజీవి తెలుగు తెరపై ధృవతారనే కాదు.. సినీ కళామతల్లికి పుట్టిన బిడ్డలను కష్టాల్లో ఆదుకోవడంలోనేూ అంతకుమించిన మనసున్న మారాజుగా వెలుగొందాడు. కరోనా కల్లోలంలో ‘సోనూ సూద్’ను మించి సీనీ కళాకారుల కోసం చిరంజీవి చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడే కాదు దశాబ్ధాలుగా సినీ ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగిన చిరంజీవి.. తన లాగా ఎవరూ కష్టపడవద్దని సినీ కార్మికులకు ఆది నుంచి అండగా ఉంటూనే ఉంటున్నాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని […]

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2021 / 06:01 PM IST
    Follow us on

    మెగా స్టార్ చిరంజీవి తెలుగు తెరపై ధృవతారనే కాదు.. సినీ కళామతల్లికి పుట్టిన బిడ్డలను కష్టాల్లో ఆదుకోవడంలోనేూ అంతకుమించిన మనసున్న మారాజుగా వెలుగొందాడు. కరోనా కల్లోలంలో ‘సోనూ సూద్’ను మించి సీనీ కళాకారుల కోసం చిరంజీవి చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి.

    ఇప్పుడే కాదు దశాబ్ధాలుగా సినీ ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగిన చిరంజీవి.. తన లాగా ఎవరూ కష్టపడవద్దని సినీ కార్మికులకు ఆది నుంచి అండగా ఉంటూనే ఉంటున్నాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతో మంది ప్రజలకు, అభిమానులకు, సినీ కార్మికులకు సేవ చేశారు.

    ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి వేళ చిరంజీవి చేసిన సేవలను తాజాగా ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ గుర్తు చేసింది. చిరంజీవి మహోపకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

    తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి పీ.ఎస్.ఎన్ దొరలు తాజాగా చిరంజీవి సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటన జారీ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో 2020 ఏప్రిల్ లో సినిమా షూటింగులు నిలిచిపోయి లాక్ డౌన్ లో ఏ సినీ కార్మికుడు బయటకు వెళ్లలేక ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ‘సీసీసీ’ ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి కమిటీని నియమించి సినిమా రంగంలోని పెద్దలందరినీ భాగస్వాములు చేసి వేలాది మంది సినిమా కార్మికుల ఆకలి తీర్చాలని సంకల్పించారని చిరంజీవి సేవలను కొనియాడారు. మూడు దఫాలుగా సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు ఇంటింటికి పంచి పెట్టి ఆదుకున్నారని.. తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి చేసిన ఈ సేవ ఎప్పటికీ నిలిచిపోతుందని గుర్తు చేసుకున్నారు.

    ఇక కరోనా సెకండ్ వేవ్ లోనూ ప్రతి సినిమా కార్మికుడికి ఆరోగ్యభద్రత కల్పించాలని అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ వేయించారని.. వారి ఆరోగ్యానికి భద్రత కల్పించిన చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక చిరంజీవితో కలిసి ఆదుకున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫెడరేషన్, 24 క్రాఫ్టులు ఎప్పుడూ చిరంజీవి ఆశయాలకు అనుగుణంగా నడుస్తాయని.. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటీ సినీ కార్మికులు, ఫెడరేషన్ సభ్యులు చిరంజీవి సేవలను వేయినోళ్ల పొగిడారు.