https://oktelugu.com/

Young Heroines Marriage:అతి చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్లే?

Young Heroines Marriage:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.అలాగే మరికొందరు సీరియల్ హీరోయిన్ లు ఐదు పదుల వయస్సులో ఉన్నప్పటికీ పెళ్లి మాటే ఎత్తడం లేదు. ఇక వీరు పెళ్లి చేసుకుంటారన్న నమ్మకం కూడా లేదు.ఇలా కొందరు హీరోయిన్లు పెళ్లి మాట ఎత్తకుండా ఇండస్ట్రీలో కొనసాగుతుంటే మరికొందరు మాత్రం ఎంతో భిన్నంగా ఇండస్ట్రీలో స్టార్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 13, 2021 / 12:25 PM IST
    Follow us on

    Young Heroines Marriage:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.అలాగే మరికొందరు సీరియల్ హీరోయిన్ లు ఐదు పదుల వయస్సులో ఉన్నప్పటికీ పెళ్లి మాటే ఎత్తడం లేదు. ఇక వీరు పెళ్లి చేసుకుంటారన్న నమ్మకం కూడా లేదు.ఇలా కొందరు హీరోయిన్లు పెళ్లి మాట ఎత్తకుండా ఇండస్ట్రీలో కొనసాగుతుంటే మరికొందరు మాత్రం ఎంతో భిన్నంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అతి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని సంసార సాగరంలోకి దిగారు మరి ఆ హీరోయిన్లు ఎవరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

    Young Heroines Marriage

    హీరోయిన్ శాలిని ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ హీరోయిన్ గా సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఇలా హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె కేవలం 21 సంవత్సరాలకు నటుడు అజిత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా జూనియర్ శ్రీదేవి ఈమె సీనియర్ నటులు మంజుల విజయ్ కుమార్ కూతురు. ఈమె రాహుల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి చేసుకునే సమయానికి ఈమె వయసు 23 సంవత్సరాలు మాత్రమే.

    Also Read: Nagarjuna: నాగార్జున నిర్ణయం వెనుక కారణం ఏమై ఉంటుంది ?

    రాధిక ఆప్టే ఈ బోల్డ్ బ్యూటీ కూడా కేవలం 23 సంవత్సరాలకే బెనడిక్ టేలర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఈమె ఎన్నో బోల్డ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. దివ్య వాణి బొబ్బిలిరాజా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె 18 సంవత్సరాలకి బాలీవుడ్ ప్రొడ్యూసర్ షాదిత్ ను పెళ్లి చేసుకున్నారు.జెనీలియా బొమ్మరిల్లు సినిమా ద్వారా హాసినిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జెనీలియా బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడు రిషితేష్ దేశ్ ముఖ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి చేసుకునే సమయానికి ఈమెకు 24 సంవత్సరాలు మాత్రమే. ఇలా పలువురు హీరోయిన్ల చిన్నవయసులోనే పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు.

    Also Read: Pawan Kalyan: నీదేం పోయింది పవన్… బొక్క నిర్మాతలకేగా