https://oktelugu.com/

‘మా’ ఎన్నికలు: ఓటుకు రూ.10వేలు అంట.. సినీ ఆర్టిస్టులకు పండుగే?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను మించి కాకరేపుతున్నాయి. ఓవైపు ప్రకాష్ రాజ్ వర్గం, మరోవైపు మంచు విష్ణు వర్గాలు విడిపోయిన సాగిస్తున్న ఈ ఎన్నికల సంగ్రామం చివరి దశకు చేరింది. ఈరోజు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ తో నామినేషన్ వేయగా.. రేపు మంచు విష్ణు ప్యానెల్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు సినీ ప్రముఖులు, […]

Written By: , Updated On : September 27, 2021 / 02:37 PM IST
Follow us on

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను మించి కాకరేపుతున్నాయి. ఓవైపు ప్రకాష్ రాజ్ వర్గం, మరోవైపు మంచు విష్ణు వర్గాలు విడిపోయిన సాగిస్తున్న ఈ ఎన్నికల సంగ్రామం చివరి దశకు చేరింది. ఈరోజు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ తో నామినేషన్ వేయగా.. రేపు మంచు విష్ణు ప్యానెల్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల వేడి రాజుకుంది.

ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు సినీ ప్రముఖులు, ఆర్టిస్టులను విందులు వినోదాల్లో ముంచితేల్చారు. వీకెండ్ లలో భారీ పార్టీలు ఇచ్చి వారిని మచ్చిక చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారిని ప్రలోభాలకు గురిచేయడం మొదలు పెట్టారని ఇన్ సైడ్ టాక్.

మా అసోసియేషన్ లో దాదాపు 600 మంది యాక్టివ్ ఓటర్లు ఉన్నారు. అందులో బడాబాబులు, సినీ ప్రముఖులు పోను దాదాపు 250 మంది పేద ఆర్టిస్టులు ఉన్నారు. వారిని టార్గెట్ చేసి ఇప్పుడు రెండు వర్గాలు ‘ఓటుకు నోటు’ తెరతీశారని సమాచారం. పేరు,పరపతి ఉన్న వారు ఎలాగూ ఓటుకు అమ్ముడుపోరు.. వారు డబ్బులు తీసుకోరు. ఈ క్రమంలోనే పేద కళాకారులను డబ్బులతో కొట్టి ఓటు వేయించుకోవాలని చూస్తున్నారట..

ఈ మేరకు వారి అకౌంట్ నంబర్లు తీసుకొని గూగుల్, పోన్ పేలు చేస్తూ దాదాపు ఓటుకు రూ.10వేల వరకూ పంపిస్తున్నారట.. తమకే ఓటు వేయాలని మాట తీసుకుంటున్నారట.. ఇక హైదరాబాద్ కు దూరంగా ఉన్న వారికి కూడా డబ్బులు పంపి, వారి రాకపోకలకు డబ్బులు సమకూర్చుతున్నట్టు టాక్.

సినీ కళాకారులకు తరచూగా ఫోన్లు చేస్తూ వారి బాధలు తెలుసుకుంటూ డబ్బులు గూగూల్ పే ద్వారా పంపిస్తూ మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల లాగా ‘మా’ ఎన్నికలను సినీ ప్రముఖులు మార్చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘మా’ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారాయని అంటున్నారు. మరి ఓటర్లు డబ్బుకు దాసోహమై ఓటును అమ్ముకుంటారా? సరైన వారిని గెలిపిస్తారా? అన్నది వేచిచూడాలి.