
Celebrities Wishes to Megastar: మెగాస్టార్ చిరంజీవికి సినీ ప్రముఖుల్లో.. ఎవరు ఏ విధంగా, స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పారో చూద్దాం.
మంచి మనసు ఉన్నవాడు మా చిరంజీవి. మంచి సుగుణాలన్నీ ఉన్న వ్యక్తి చిరంజీవి. ఒక నటుడిగా మెగాస్టార్ అనిపించుకున్నాడు. ఆ దేవుడు చిరంజీవిని ఎప్పుడు కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. – నటసార్వభౌమ నవరసాల నటచక్రవర్తి కైకాల సత్యనారాయణ
హ్యాపీ బర్త్ డే టు మెగా మెగా.. మెగా మెగాస్టార్ చిరంజీవిగారు. ఒక్క మా తరానికే కాదు. రానున్న భవిష్యత్తు తరాలకు కూడా మీరే ఇన్స్పిరేషన్ గా ఉంటారు – నేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్
మద్రాసులో ఉండే సమయంలో చిరంజీవి పుట్టినరోజుకు అందరం కలుసుకునే సరదాగా గడిపేవాళ్ళం. నిజానికి చిరంజీవి నాకన్నా వయసులో చిన్నవాడు. అయినా.. నేను మాత్రం తనను ‘బాబాయ్’ అని పిలిస్తూ ఉండేవాడిని. ఇప్పటికీ, ఎప్పటికీ చిరంజీవి జగదేకవీరుడే. – తెలుగు చిత్రాల దర్శకేంద్రుడు – కె.రాఘవేంద్రరావు
చిరంజీవీగారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా సుఖంగా ఉండాలి. మీ కంటే పెద్దవాడిగా ‘శతమానం భవతి శతాయః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి’ అని ఆశీర్వదిస్తున్నాను. – కళాతపస్వి దర్శకులు కె. విశ్వనాథ్
చిరంజీవిగారు నాకు గైడ్, నన్ను ఎప్పుడు ప్రోత్సహించే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు మీ జీవితంలో మునుపటి కంటే ఇక పై ఎక్కువ సక్సెస్ ను చూడాలి – విక్టరీ వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవిగారి విజయయాత్ర ఇలాగే ఇంకా ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను – అలనాటి తార ఊర్వశి శారద
చిరంజీవిగారి ఏమి చెప్పాలి, ఆయన స్వయంకృషికి మారుపేరు. సినిమా హీరోగా సినిమాలకు ఓ కొత్త ఒరవడిని సృష్టించిన వ్యక్తి చిరంజీవిగారు – సీనియర్ నటి ప్రభ
ఇక తెల్లవారుజామునే రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు కొందరు చిరంజీవి ఇంటికి చేరుకొని మరి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ రోజు మొత్తం సోషల్ మీడియాలో ‘మెగాస్టార్ చిరంజీవి’ పేరే ట్రెండింగ్ అయిపోయింది.