Unstoppable Show: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఆ షోకి రాజమౌళి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. రాజమౌళితో కీరవాణి కూడా వెళ్తాడట. అఖండ” ఈవెంట్ కి కూడా రాజమౌళి అతిథిగా వెళ్ళాడు. అలాగే గతంలో కూడా బాలయ్య నటించిన పలు చిత్రాలకు రాజమౌళి అతిథిగా వెళ్లాడు. ఇప్పుడు ఈ ‘అన్ స్టాపబుల్’ షోకి కూడా వెళ్లబోతున్నాడు.

ఇప్పటికే ఈ షోకి మహేష్ బాబు కూడా వెళ్ళాడు. ఆల్ రెడీ మహేష్ తో ఒక ఎపిసోడ్ ను షూట్ చేశారు. అది త్వరలోనే స్ట్రీమ్ కానుంది. ఏది ఏమైనా ఎప్పుడూ గంభీరంగా ఉండే బాలయ్య హోస్ట్ గా చేయడం, పైగా ఆ షో సూపర్ హిట్ అవ్వడం.. మొత్తమ్మీద బాలయ్య అంటే ఏమిటో అందరికీ అర్థం అయింది. ఆయన హోస్ట్ గా బాగా సక్సెస్ అయ్యారు.
ఫీల్డ్ ఏదైనా బాలయ్య అడుగుపెడితే అక్కడ రికార్డులు గల్లంతే అనే నినాదం జనంలోకి బాగా వెళ్ళింది. ఎలాగూ అఖండతో విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు బాలయ్య. బాలయ్య టాక్ షో కారణంగానే ఆహాకు చందాదారులు విపరీతంగా పెరిగినట్లు, స్వయంగా నిర్వాహకులు పబ్లిక్ గా చెప్పడం విశేషం. ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా వచ్చిన మోహన్ బాబు దగ్గర నుంచీ వచ్చిన ప్రతి గెస్ట్ చాలా ఓపెన్ గా మాట్లాడారు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ తమిళంలో ఎలా మాట్లాడాడో తెలుసా? చూస్తే తట్టుకోలేరు?
అయితే, ఇక్కడ ఒక విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాలయ్య ఎక్కడా డిప్లమాటిక్ ప్రశ్నలు అడగరు. అలాగే గెస్ట్ లు కూడా చాలా ఓపెన్ గా మాట్లాడే విధంగా బాలయ్య ప్రవర్తన ఉంటుంది. ఇక బాలయ్యలోని ఓపెన్ నెస్ కూడా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది.
అన్నట్టు రానున్న ఎపిసోడ్స్ లో ఒక ఎపిసోడ్ కి “ఆర్ఆర్ఆర్” హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా రాబోతున్నారట. మరి బాలయ్య షోకి ఎన్టీఆర్ వెళ్తే.. ఆ కికే వేరు. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తోందో చూడాలి.
Also Read: Radhe Shyam Movie: “సంచారి” అంటూ వచ్చేస్తున్న ప్రభాస్… రాధే శ్యామ్ నుంచి స్వీట్ న్యూస్