
Chiru Godfather Movie: మెగాస్టార్ చిరంజీవి ఏరి కోరి చేస్తోన్న సినిమా ‘గాడ్ ఫాదర్’(‘God Father’). ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురావడానికి మెగాస్టార్ తన పరపతిని వాడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)ను ఒప్పించారు. కేవలం చిరు కోసమే సల్మాన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.
ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దించబోతుంది గాడ్ ఫాదర్ టీమ్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి ఒప్పించారు. అయితే, రూమర్స్ గా మొదలైన ఈ వార్తలో నిజంగానే వాస్తవం ఉంది అని తెలుస్తోంది. తాజాగా రణ్ వీర్ సింగ్ ఈ సినిమా కోసం తన డెట్స్ సర్దుబాటు చేశాడట.
ఇక ఈ ‘గాడ్ ఫాదర్’ మూవీ షెడ్యూల్ ఈ నెల 19 నుండి 28 వరకు సాగనుంది. అయితే, రణ్ వీర్ సింగ్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం మాత్రం తెలియలేదు. హిందీ ఫ్యాన్స్ కూడా రణ్ వీర్ సింగ్ రోల్ పై ఆరా తీస్తున్నారు. అయితే, ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రనే తెలుగు వెర్షన్ లో రణ్ వీర్ సింగ్ పోషించబోతున్నాడట.
కానీ, ఇదే రోల్ ను సల్మాన్ ఖాన్ చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. నిజానికి సల్మాన్ ఖాన్ కి ఈ రోల్ సెట్ కాదు. రణ్ వీర్ సింగ్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కాబట్టి, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పోషించబోయే పాత్ర వేరేది అయి ఉంటుంది. అయినా సల్మాన్ ఖాన్ ఏ పాత్ర చేసినా ఈ సినిమాకి వచ్చే క్రేజే వేరు.
అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ కి సోదరిగా లేడి సూపర్‌స్టార్ నయనతార నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు.