Chiru Godfather Hindi Digital Rights: ఆచార్య వంటి డిసాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్..మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి ఇది రీమేక్..ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట..నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా తమిళ అగ్ర దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

మెగా అభిమానులు ఈ సినిమా పై కోటి ఆశలు పెట్టుకున్నారు..ఎందుకంటే అసలే ఆచార్య సినిమా డిసాస్టర్ ప్లాప్ అవ్వడం తో ఈ సినిమా ఎలా అయినా మెగాస్టార్ కి బిగ్గెస్ట్ కం బ్యాక్ మూవీ అవ్వాలనే కోరిక తో ఉన్నారు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రభుదేవా దర్శకత్వం లో చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ మీద ఒక అద్భుతమైన సాంగ్ ని తెరకెక్కించబోతున్నారు అట..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పుడు క్రేజీ బిజినెస్ జరుగుతుంది.
Also Read: Actor Suriya Daughter Diya: చిన్న వయస్సులోనే ప్రభంజనం సృష్టించిన హీరో సూర్య కూతురు

మన తెలుగు సినిమాలకి హిందీ లో మంచి క్రేజ్ ఉండే సంగతి మన అందరికి తెలిసిందే..యూట్యూబ్ లో తెలుగు నుండి హిందీ కి దబ్ అయినా తెలుగు సినిమాలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి..ఇక టీవీ లో టెలికాస్ట్ చేసినప్పుడు కూడా బాలీవుడ్ సినిమాలకు మించి TRP రేటింగ్స్ ని సొంతం చేసుకుంటుంటాయి..అందుకే మన టాలీవుడ్ సినిమాల డబ్బింగ్ రైట్స్ ని భారీ మొత్తానికి అమ్ముతుంటారు..అలా గాడ్ ఫాదర్ సినిమా డిజిటల్ + సాటిలైట్ రైట్స్ కలిపి దాదాపుగా 45 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది..ఇది ఒక ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు..సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ ఉండడం వల్ల ఈ సినిమా కి ఈ స్థాయి క్రేజ్ ఏర్పడిందని తెలుస్తుంది..ఇక హిందీ లో థియేట్రికల్ బిజినెస్ కి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయట..రీమేక్ సినిమా అయినప్పటికి కూడా ఈ మూవీ ని హిందీ మరియు తమిళం లో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు..ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకముందు నుండే భారీ అంచనాలు రేపిన ఈ చిత్రం..రాబొయ్యే రోజుల్లో ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read:Naresh and Pavithra Lokesh: నరేశ్, పవిత్రలు విడాకులు తీసుకున్నాకే పెళ్లి..!
Recommended Videos



[…] […]