
మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో తిరిగి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షో మొత్తం హౌస్ ఫుల్ అయ్యిందని టాక్. అన్ని ప్రీమియర్‌ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు.
మెగా అభిమానులే కాదు.. మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై చూడటానికి ఆసక్తిగా ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ పాత ఫొటోను ట్వీట్ చేశాడు. పవన్ తో కలిసున్న పాత ఫొటోను అభిమానులతో పంచుకొని ఈ మేరకు ట్వీట్ చేశాడు. పవర్ స్టార్ పవన్ సినిమా కోసం ప్రేక్షకులతో తాను చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. తన కుటుంబంతో కలిసి రేపు సాయంత్రం థియేటర్లలో ఈ చిత్రాన్ని చూస్తామని చిరంజీవి చెప్పారు.
చిరంజీవి ట్విట్టర్‌లో ఈ మేరకు ఇలా రాసుకొచ్చాడు. ‘‘చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో వకీల్ సాబ్ సినిమాను చూస్తున్నాను. ఇక ఆగలేను. ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీతోపాటు చూసి ఎంజాయ్ చేస్తాను. స్టే ట్యూన్ డ్’’ అని మెగాస్టార్ ట్వీట్ చేశాడు.
హిందీ హిట్ చిత్రం పింక్ రీమేక్ గా ‘వకీల్ సాబ్’ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. ప్రధాన తారాగణంతో పాటు, ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య, మరియు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ తెలుగు రీమేక్ కథను నేటివిటీకి అనుగుణంగా మార్చి తీశాడు. పవన్ మార్కెట్ మరియు స్టామినాకు సరిపోయేలా ఒరిజినల్ స్క్రిప్ట్‌లో అవసరమైన మార్పులు చేశాడు. ఈ అధికారిక రీమేక్‌ను దిల్ రాజు మరియు బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.
చాలా కాలం తరువాత @PawanKalyan ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో #VakeelSaab చూస్తున్నాను.Can't wait to share my response of the film with you all. Stay tuned 🙂 pic.twitter.com/eRyVbsMke0
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2021