Dil Raju On Chiranjeevi: దిల్ రాజు ప్రొడ్యూసర్ గా చిరంజీవి కొత్త సినిమా…డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతానికి దిల్ రాజు బ్యానర్ లో చాలామంది డైరెక్టర్లు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. అందులో ఒక డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేయించాలని దిల్ రాజు చూస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా సినిమా చేయడానికి దిల్ రాజు దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఉన్నాడు.

Written By: Gopi, Updated On : January 28, 2024 10:25 am
Follow us on

Dil Raju On Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ల లో దిల్ రాజు ఒకరు.ఈయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. దానికి కారణం ఆయన తీసే సినిమా స్క్రిప్ట్ లో చాలావరకు ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఏ హీరో కి ఏ స్టోరీ బాగుంటుంది అనేది ఆయనకి బాగా తెలుసు. అందుకే ఆయన దగ్గరుండి అలాంటి స్క్రిప్ట్ చేయిస్తు వస్తుంటాడు.

కాబట్టి ఆయనకి మిగిలిన ప్రొడ్యూసర్లతో పోల్చుకుంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఇక ఆయన సక్సెస్ అవ్వడానికి కారణం కూడా అయన జడ్జిమెంట్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు చిరంజీవిని హీరోగా పెట్టి తన బ్యానర్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే చిరంజీవి విశ్వం భర సినిమా చేస్తున్నాడు. ఇక తన బ్యానర్ లో చిరంజీవితో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటినుంచో అనుకుంటున్నాడు కానీ అది ఇప్పటి వరకు కుదరలేదు. దాంతో ఇప్పుడు వీళ్ళ సినిమా సెట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది.

ప్రస్తుతానికి దిల్ రాజు బ్యానర్ లో చాలామంది డైరెక్టర్లు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. అందులో ఒక డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేయించాలని దిల్ రాజు చూస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా సినిమా చేయడానికి దిల్ రాజు దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఉన్నాడు. కాబట్టి హరీష్ శంకర్ చిరంజీవి కాంబినేషన్ సినిమాని సెట్ చేసే విధంగా దిల్ రాజు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే హరీష్ శంకర్ తన ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక స్టోరీ ని కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. ఆ సినిమా స్క్రిప్ట్ చిరంజీవికి చెప్పి ఆయన్ని ఒప్పించి సినిమా చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం చిరంజీవి విశ్వభర సినిమా షూట్ లో ఉన్నాడు కాబట్టి ఈ షూట్ ముగిసిన తర్వాత దిల్ రాజు సినిమా ఉండచ్చు.

కానీ మొత్తానికి అయితే దిల్ రాజు చిరంజీవిని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. ఇక ఇప్పటివరకు స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసిన దిల్ రాజు ఒక చిరంజీవి తో మాత్రమే ఇప్పటివరకు వాళ్ళ బ్యానర్ లో సినిమా చేయలేదు. అందువల్లే ఆ సినిమాను కూడా చేసి ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ గా తను ఒక మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు…