Chiranjeevi
Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన ప్రభంజనం అలాంటిది. ఇక ఇప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. ఆయన లేకపోతే తెలుగు సినిమా అనేది ఈ స్థాయిలో ఉండేది కాదు అంటూ కొంతమంది ఇతర భాషల హీరోలు సైతం అతని మీద వర్షం కురిపించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
గత 40 సంవత్సరాలనుంచి మెగాస్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeev)… ఆయన సాధించిన విజయాల ముందు ఇప్పుడు మన స్టార్ హీరోలు సాధిస్తున్న విజయాలు ఎందుకు పనికిరావనే చెప్పాలి. తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో అవార్డులు, మరేన్నో రివార్డులను అందుకున్న ఆయన చేసే ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వమైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లుగా నిలిచాయి. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి కెరియర్ లో చాలా వరకు రీమేక్ సినిమాలను కూడా చేశాడు. ఇక మోహన్ లాల్ (Mohan Laal) హీరోగా వచ్చిన ‘లూసీఫర్’ (Lucifer) సినిమాని తెలుగులో ‘ గాడ్ ఫాదర్ ‘ (God Father) పేరుతో రీమేక్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్టును మొదట యంగ్ డైరెక్టర్ అయిన సుజీత్ డైరెక్షన్ లో చేయాలని అనుకున్నాడు. కానీ ఆయన చేసిన మార్పులు చేర్పులు చిరంజీవికి నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ పక్కకు తప్పుకున్నాడు…
దాంతో తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ‘మోహన్ రాజా’ (Mohan Raja) వచ్చి సినిమా డైరెక్షన్ చేసి సినిమాని యావరేజ్ హిట్ గా నిలిపాడు. మరి ఏది ఏమైనా కూడా సుజీత్ డైరెక్షన్ లో చిరంజీవి కనిపిస్తే అది వేరే లెవెల్లో ఉండేదని చాలామంది సినిమా మేధావులు సైతం అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్ చిరంజీవిని డైరెక్షన్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందువల్ల చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలని యంగ్ డైరెక్టర్లకి ఒక కోరిక అయితే ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలోనే సుజీత్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రాజెక్టు అయితే వర్కౌట్ కాలేదు. మరి ప్రస్తుతం ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భారీ సక్సెస్ ని అందించడానికి సుజీత్ విపరీతంగా కష్టపడుతున్నాడు.
ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే సుజీత్ మెగాస్టార్ చిరంజీవితో కూడా మరొక సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీగా తెలియదు. కానీ వచ్చినప్పుడు మాత్రం ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేస్తుందనే చెప్పాలి…