Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా టాప్ స్టార్ హోదా నిలబెట్టుకుంటున్నారు. కొత్త జనరేషన్ వచ్చినా ఆయన మేనియా జనాల్లో తగ్గలేదు. ఇప్పటికీ బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తూ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు. గత ఏడాది చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్య రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భోళా శంకర్ మాత్రం నిరాశపరిచింది. ఈసారి గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిన చిరంజీవి క్రేజీ సబ్జెక్టు ఎంచుకున్నాడు. యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంభర చిత్రం చేస్తున్నారు.
విశ్వంభర త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది సోషియో ఫాంటసీ సబ్జెక్టు. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల కానుందని సమాచారం. ఈ క్రమంలో చిరంజీవి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. పాత్ర కోసం ఆయన మేకోవర్ కి సిద్ధమయ్యారు. బరువు తగ్గి ఫిట్ అండ్ స్లిమ్ గా కనిపించాలని చిరంజీవి భావిస్తున్నారు.
చిరంజీవి జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. కఠిన వ్యాయామం చేస్తున్నారు. గంటల తరబడి చెమటలు చిందిస్తున్నారు. ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో చిరంజీవి వ్యాయామం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. విశ్వంభర కోసం సిద్ధం అవుతున్నానని క్యాప్షన్ ఇచ్చారు. 68 ఏళ్ల చిరంజీవి ఇంత కష్టపడటం ఆయన కమిట్మెంట్ కి నిదర్శనం.
ఒక్క వీడియోతో చిరంజీవి విశ్వంభర చిత్రంపై అంచనాలు పెంచేశాడు. సినిమాలో ఆయన లుక్ పై ఆసక్తి పెరిగిపోతుంది. కాగా కథలో భాగంగా చిరంజీవి మూడు లోకాల్లో సంచరిస్తారట. ఆయా లోకాల్లో అందమైన భామలతో రొమాన్స్ చేశాడట. ముగ్గురు హీరోయిన్స్ వరకు విశ్వంభరలో నటిస్తున్నారనే టాక్ ఉంది. ఇక చిరంజీవి డిఫరెంట్ గెటప్స్, షేడ్స్ లో కనిపించడం ఖాయం అంటున్నారు.
Gearing up .. And raring to go #Vishwambhara pic.twitter.com/VeUj0yhN35
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2024