Chiranjeevi : అత్యుత్సాహంతో ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాట్లాడే కొన్ని మాటలు సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారుతున్నాయి. బహుశా వయస్సు ప్రభావం వల్ల అయ్యుండొచ్చు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎంత బ్యాలన్స్ గా మాట్లాడేవాడు, గౌరవంగా, పెద్ద మనిషి తరహాలో మాట్లాడాలంటే చిరంజీవి గారి తర్వాతే ఎవరైనా అని అందరూ అంటుంటారు. కానీ ఈమధ్య ఆ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతూ ఉంది. అభిమానులు చిరంజీవి ని ఎంతో ఉన్నతంగా చూస్తారు. రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి నుండి, దేశ స్థాయి ప్రధాని వరకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో గౌరవం చూపిస్తారు. అభిమానులు చిరంజీవి స్థానం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కంటే గొప్పదని ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి మెగాస్టార్ నోటి నుండి ఎప్పుడూ ఆదర్శప్రాయమైన మాటలే వస్తుంటాయి కానీ, సరదా సమయంలో మాత్రం ఎందుకో కాస్త హద్దులు మర్చిపోతున్నాడేమో అని అనిపిస్తుంది.
నిన్న ఆయన ‘బ్రహ్మ ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళాడు. బ్రహ్మానందం(Bramhanandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Gautham) కలిసి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. చిరంజీవి కి బ్రహ్మానందం గారు ఎంతో సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు లాంటి వాడు కాబట్టి, నిన్న ఆయన ఈ ఈవెంట్ కి విచ్చేసారు. బ్రహ్మానందం తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుతూ, మధ్యలో సరదాగా కొన్ని కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘మా తాతగారి పేరు రాధాకృష్ణనాయుడు. మా ఇంట్లో వాళ్ళు అందరూ మా తాటాకు భయపడి, ఆయన పోలికలు నీకు రాకూడదు అని కోరుకునేవారు. ఎందుకంటే మా తాత మంచి రసికుడు. నాకు ఇంట్లోనే ఇద్దరు అమ్మమ్మలుండేవారు. వారిలో ఆయన ఒకరి మీద అలిగినప్పుడు, మరో ఆమె వద్దకు వెళ్ళేవాడు. కానీ ఆయనలో గొప్ప దానగుణం ఉంది. ఎన్నో వెలకట్టలేని సేవాకార్యక్రమాలు చేసారు, ఆయనలోని రసిక గుణం నాకు అబ్బలేదు కానీ, దాన గుణం అబ్బింది’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకునే వాళ్లకు సరదాగానే ఉంటుంది, కానీ బాగా అలోచించి చూస్తే చిరంజీవి స్థాయికి ఈ మాటలు తగునా? అని అనిపించక తప్పదు. తన తాతగారి దాన గుణం గురించి మాట్లాడడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ రసిక గుణం గురించి మాట్లాడడం అవసరమా..?, చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎందుకు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అత్యుత్సాహం కారణంగా వచ్చే వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయి. నిన్న ఆయన ప్రసంగం లో మధ్యలో రెండు బూతులు కూడా వచ్చాయి. ఇవన్నీ సోషల్ మీడియా లో వైరల్ అవుతూ మెగాస్టార్ పై తీవ్రమైన విమర్శలు అయ్యేలా చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆయన ఒక మాట మాట్లాడే ముందు, ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మాట్లాడితే బెటర్ అంటూ అభిమానులు సైతం సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.