https://oktelugu.com/

సినీ కార్మికులకు చిరంజీవి మరో వరం

మెగా స్టార్ చిరంజీవి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే కరోనా లాక్ డౌన్ వేళ సోనూ సూద్ లా తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఎంతో మందికి సాయం చేశాడు. ఆక్సిజన్ కొరత ఉంటే ఆ ప్లాంట్లు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెట్టించాడు. కరోనాతో చనిపోయిన సినీ కళాకారులు, జర్నలిస్టులు, పేదలకు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. తాజాగా కరోనాను అరికట్టి సినీ రంగాన్ని పట్టాలెక్కించడానికి చిరంజీవి నడుం బిగించారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ […]

Written By: , Updated On : June 13, 2021 / 10:11 AM IST
Follow us on

Chiranjeevi

మెగా స్టార్ చిరంజీవి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే కరోనా లాక్ డౌన్ వేళ సోనూ సూద్ లా తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఎంతో మందికి సాయం చేశాడు. ఆక్సిజన్ కొరత ఉంటే ఆ ప్లాంట్లు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెట్టించాడు. కరోనాతో చనిపోయిన సినీ కళాకారులు, జర్నలిస్టులు, పేదలకు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు.

తాజాగా కరోనాను అరికట్టి సినీ రంగాన్ని పట్టాలెక్కించడానికి చిరంజీవి నడుం బిగించారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ ఆధ్వర్యంలో గత వారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 4 వేల మంది సినీ కార్మికులకు వ్యాక్సినేషన్ వేయించినట్లు చిరంజీవి వెల్లడించారు.

చిరంజీవి గత ఏడాది ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) , కరోనా వైరస్ మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సీనీ కార్మికులకు కొద్ది నెలల పాటు ఉచితంగా రేషన్ సరఫరా చేసిన సంగతి తెలిసిందే.

ఇక రెండో వేవ్ సమయంలో చిరంజీవి స్వయంగా ఆక్సిజన్ బ్యాంకులను తెలుగు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో స్థాపించారు. అయితే సీసీసీ ఆధ్వర్యంలో సినీ పరిశశ్రమకు చెందిన 4వేల మంది కార్మికులకు గత వారం రోజులలో టీకాలను వేయించినట్లు చిరంజీవి వెల్లడించారు.

ఇక సినీ కార్మికులకే కాకుండా సినీ ఫెడరేషన్ కు సంబంధించిన ఇతర అసోసియేషన్ లకు చెందిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందని చిరంజీవి సంచలన ప్రకటన చేశాడు. అపోలో సహా ఇతర ప్రైవేటు ఆస్పత్రుతో చిరంజీవి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం టైఅప్ చేసుకొని ఉన్నారు.

మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి ఈ కరోనా కల్లోలంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ తెలుగు సినీ కార్మికులకు అండగా నిలవడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.