
కరోనా ప్రభావం రోజు రోజుకి తీవ్రమౌతున్న తరుణం లో సినిమా రంగం పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన సినీ పెద్దల్లో చర్చనీయాంశం అవుతోంది. షూటింగ్ పూర్తి చేసుకొన్న సినిమాలది ఒక బాధ అయితే , సగం షూటింగ్ జరుపుకున్న సినిమాలది ఇంకో భాద. షూటింగ్ లేట్ అవ్వడం వలన పెట్టుబడి మీద వడ్డీలు విపరీతంగా పెరిగి పోతుండటం నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
జర్నలిస్టులకు బీమా కల్పించాలి: పవన్ కల్యాణ్
లాక్ డౌన్ తీసివేసిన తరవాత మే నుండి అయినా షూటింగ్స్ మొదలవుతాయని నమ్మకంతో ఉన్న దర్శక నిర్మాతలకు ఆ నమ్మకం రోజురోజుకి సన్నగిల్లు తోంది . పరిస్థితులను చూస్తుంటే లాక్ డౌన్ ఇప్పట్లో ఆగేలా లేదు . దీనితో కొందరు నిర్మాతలు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని ఇండోర్ సెట్స్ లో షూటింగ్స్ జరుపు కొంటే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలో చిరంజీవి నటిస్తున్న 152 వ చిత్రం ఆచార్య చిత్ర యూనిట్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి .
కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ముంబైలో హెల్డప్ అయిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికి కాజల్ అగర్వాల్ లేని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట.