
కరోనా లోక్ డౌన్ వల్ల తెలుగు నాట వెబ్ సిరీస్‌లకు క్రేజ్ పెరుగుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలు వెబ్ సిరీస్‌లను వీక్షించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఓ సర్వేలో తేలింది . దరిమిలా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ లోకి స్టార్ హీరోలను తీసుకొచ్చి వెబ్ సిరీస్‌ల్లో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఏపీలో అదుపు గాని వైరస్… కేంద్రం సీరియస్
ఆ క్రమం లో ఓ టాప్ ఓటీటీ సంస్థ నుంచి మెగాస్టార్ చిరంజీవి కి గోల్డెన్ అఫర్ వచ్చిందట …అందుకు చిరంజీవి పాజిటివ్ గా స్పందించి .‘డైరెక్టర్‌ను పంపిస్తే కథ వింటానని వారికి రిప్లై ఇచ్చాడట పనిలో పనిగా మంచి క్రేజీ కథలతో వచ్చే యంగ్ టాలెంట్స్ ను తనవద్దకు తీసుకురమ్మని మేనేజర్‌కు కూడా చెప్పడం జరిగిందట . దీంతో చిరంజీవి త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారని వార్త గుప్పుమంది ..
జర్నలిస్టులకు బీమా కల్పించాలి: పవన్ కల్యాణ్
150 వ చిత్రం తో తిరిగి వెండి తెరపై విజృంభిస్తున్న మెగాస్టార్ తన రూట్ మార్చి యంగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ క్రమంలో సురేందర్ రెడ్డి కి `సైరా` సినిమా ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించాడు. ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న మెగాస్టార్, ఈ సినిమా తర్వాత ముగ్గురు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు ఉంటాయని తానే స్వయంగా చెప్పడం జరిగింది . యంగ్ డైరెక్టర్స్ సాహో సుజిత్, వెంకీ మామ ఫేమ్ బాబీ, బిల్లా ఫేమ్ మెహార్ రమేశ్‌లతో తన తదుపరి సినిమాలు ఉంటాయని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇపుడు వాటితో పాటు వెబ్ సిరీస్ కి కూడా సన్నద్ధమౌతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి .. .