Chiranjeevi: సేవా కార్యక్రమాలు చేయడం లో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందు ఉంటాడు. తాను ముందుండి ఫ్యాన్స్ ని నడిపిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న చిరంజీవి గురించి తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. దేశం మొత్తం కూడా చేతులెత్తి మొక్కే విధంగా సహాయం చేసిన చిరంజీవి ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన చేసిన సేవలకు సలాం చెప్పింది.
కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు కోసం ఎంత ఇబ్బంది ఎదురైందో అందరికీ తెలుసు. దేశంలో సరిపడిన స్థాయిలో సిలిండర్లు లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు వదిలారు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ లో ఈ సమస్య తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ సమయంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ స్థాపించి రెండు రాష్ట్రాల్లోనూ పంపిణీ చేపట్టారు. అయితే.. సిలిండర్స్ రీఫిల్లింగ్ కూడా ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను కూడా చిరంజీవి పరిష్కరించారు. అందుకు అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ (సిలిండర్స్ రీ-ఫిల్లింగ్ అవసరం లేని పరికరాలు)ను అమెరికాతో పాటు వివిధ దేశాల నుంచి తెప్పించారు.
సరిగ్గా అదే సమయంలో కర్ణాటక సరిహద్దులో ఉంటున్న బీఎస్ఎఫ్ బలగాలు కోవిడ్ బారిన పడ్డారు. దీనితో వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి తన బృందాన్ని సిద్ధం చేసి అనుకున్న సమయంలో బీఎస్ఎఫ్ బలగాలు కు ఆ సిలిండర్లు అందేలా ఏర్పాట్లు చేశాడు . కరోనా సమయంలో ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడుతున్న వేళ ప్రాణాలకు తెగించి మరి మెగా ఫ్యాన్స్ 74 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు సహాయం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారి సేవ ను ప్రత్యేకంగా ప్రశంసించింది.
ఆక్సిజన్ బ్యాంకు స్థాపన, సిలిండర్ల కొనుగోలు, కాన్సంట్రేటర్స్ కొనుగోలు, సిలిండర్స్ పంపిణీ, రీ-ఫిల్లింగ్ వంటి వాటికీ ఎక్కడ కూడా ఖర్చుకు వెనుకాడకుండా సొంత నిధులతో మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమం చేశాడు. తనను ఇంత వాడిని చేసిన సమాజానికి, తెలుగు ప్రేక్షకులకు మంచి చేయాలనే ఆలోచన చిరంజీవి కి ఎప్పుడు ఉంటుంది. అందులో నుండి పుట్టినవే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఈ ఆక్సిజన్ బ్యాంకు కావచ్చు. మరోపక్క తనకు తల్లి లాంటి సినీ పరిశ్రమ కష్టాల్లో ఉన్న ప్రతి సారి ఒక కొడుకుగా తన బాధ్యతలను నిర్వర్తించాడు చిరంజీవి. అందుకే ఆయన అందరి వాడయ్యాడు.