https://oktelugu.com/

Megastar Chiranjeevi: చిరంజీవిని అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు మెచ్చుకుంటున్నారు..

వాస్తవానికి చిరు ప్రొడ్యూసర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నో ఆశలతో వారు సినిమాకు ఫైనాన్స్ చేస్తారు. సినిమా హిట్టయితే ఫర్వాలేదు. కానీ డిజాస్టర్ అయితే మాత్రం తట్టుకోలేరు. అందువల్ల నిర్మాత డబ్బులు వృథా కాకుండా సినిమా స్టోరీని సిద్దం చేసుకోవాలని అన్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 6, 2023 / 01:26 PM IST
    Follow us on

    Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చెప్పుకుంటారు. పరిశ్రమలో ఎవరికి ఆపద వచ్చినా ఆయనే ముందుంటారనే విషయం కనిపిస్తూ ఉంటుంది. ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు పరిశ్రమ గురించి ఆయన పలు సూచనలను చేస్తుంటారు. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఇందులో కొన్ని డిజాస్టర్ గా మిగిలాయి. ముఖ్యంగా ఎంతో ఎక్స్ పెక్ట్ చేసిన ‘ఆచార్య’ తీవ్ర నిరాశను మిగిల్చింది. అ సమయంలో చిరంజీవి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై చాలా మంది ట్రోలింగ్ చేశారు.. కానీ ఇప్పుడు ఆయన చెప్పిందే వాస్తవం.. అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ చిరంజీవి అప్పుడేం చెప్పారు?

    అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ రిలీజైన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో సినిమా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర సంచలన కామెంట్స్ చేశారు. ఈ సినిమా గ్రౌండ్ స్క్రిప్ట్ పూర్తిగా లేకుండా షూటింగ్ మొదలు పెట్టామని, దీనిపై ఎవరిని నిందించొద్దని ఆయన అన్నారు. ఈ సినిమా విఫలం కావడానికి పూర్తిగా తనదే బాధ్యత అని అన్నారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అలా అన్నారనేది అర్ధమైందని చాలా మంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

    ఈ నేపథ్యంలో ఆనాడు చిరంజీవి అన్న డైలాగ్స్ ను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆచార్య సినిమా తరువాత ఆయన ‘వాల్తేరు వీరయ్య’లో నటించారు.ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ ‘సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే స్టోరీని సిద్ధం చేసుకోండి.. షూటింగ్ మధ్యలో సందర్భానుసారం స్టోరీని తయారు చేయడం ఏం బాగోదు.. సీన్ మారిస్తేపర్వాలేదు. కానీ అప్పటి కప్పుడే సీన్ ను సృష్టిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పద్ధతిని కొందరు డైరెక్టర్లు మార్చుకోవాలి’ అని చిరు అన్నారు.

    వాస్తవానికి చిరు ప్రొడ్యూసర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నో ఆశలతో వారు సినిమాకు ఫైనాన్స్ చేస్తారు. సినిమా హిట్టయితే ఫర్వాలేదు. కానీ డిజాస్టర్ అయితే మాత్రం తట్టుకోలేరు. అందువల్ల నిర్మాత డబ్బులు వృథా కాకుండా సినిమా స్టోరీని సిద్దం చేసుకోవాలని అన్నారు. నిర్మాత బాగున్నప్పుడే అప్పడే ఇండస్ట్రీ కళకళలాడుతుందని చెప్పారు. ఇప్పుడున్న డైరెక్టర్లను ఉద్దేశించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

    అయితే ఆ సమయంలో చిరు చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు ట్రోలింగ్ చేశారు. ఆచార్య సినిమాకు ఉన్న నిర్మాతల్లో రామ్ చరణ్ కూడా ఉన్నారు. అందుకే ఆయన ఇలా మాట్లాడారని కొందరు ఏవేవో మెసేజ్ లు పెట్టారు. కానీ ఇప్పుడు ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర అవే వ్యాఖ్యలు చేయడంతో చిరంజీవి చెప్పింది నిజమేనని అంటున్నారు. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా భావిస్తున్న చిరంజీవి ఎప్పటికైనా నిజాలే మాట్లాడుతారని కొందరు అంటున్నారు.