Chiranjeevi and NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి ఉన్న స్థానం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి…మరి ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఆ సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు…ఇక ఇప్పుడు ఆయన అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు… ఇక మరో నెల రోజుల్లో ఈ సినిమా స్టార్ట్ అవ్వబోతున్నా నేపధ్యంలో ఈ సినిమా ను 2026 సంక్రాంతి బరిలో నిలపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సంక్రాంతి కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) అనే సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న అనిల్ రావిపూడి వచ్చే ఏడాది కూడా భారీ సక్సెస్ కొట్టడానికి సిద్దం అవుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీయార్(NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో రాబోతున్న సినిమా జనవరి 9 2026 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే వీళ్ళు డేట్ ను కూడా అనౌన్స్ చేయడం తో చిరంజీవి, ఎన్టీయార్ మధ్య వచ్చే సంక్రాంతికి భారీ పోటీ ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తోంది…మరి ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారు…ఎవరు భారీ కలెక్షన్స్ ను సాధిస్తారు…ఎవరి చేతిలో ఎవరు ఓడిపోతారనే విషయాల్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు విపరీతమైన అసక్తి చూపిస్తున్నారు…
మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ మీద అనిల్ రావిపూడి పోటీ పడగలాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…అయితే ఈ పోటీ హీరోల మధ్యనే కాకుండా డైరెక్టర్ల మధ్య కూడా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇద్దరు దర్శకులకు ఇప్పటి వరకు ప్లాప్ అయితే రాలేదు…
కాబట్టి ఈ సినిమాలతో ఎవరు ఎలాంటి విజయాలను సాధిస్తారు. తద్వారా ఎవరు భారీ సక్సెస్ ను సాధించబోతున్నారనేది తెలియాల్సి ఉంది…ఇక ఫస్ట్ టైమ్ ఇటు హీరోలకు అటు డైరెక్టర్లకు మధ్య భీకరమైన పోటీ అయితే నడుస్తోంది…చూడాలి మరి ఈ సినిమాలతో ఎవరు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…
అయితే ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చిరంజీవి ఎన్టీయార్ మధ్య పోటీ ఉండటం అనేది మాస్ ప్రేక్షకులను ఎక్కువగా అలరించే అవకాశమైతే ఉంది…ఎవరు ఎలాంటి సినిమా చేసిన కూడా సంక్రాంతి విన్నర్ ఎవ్వరు అవుతారు అనే దానిమీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉందనేది వాస్తవం….