Chiranjeevi – Trivikram: రీ ఎంట్రీ తర్వాత తొలిసారి మెగాస్టార్ చిరంజీకి కి ఆచార్య సినిమా రూపంలో డిజాస్టర్ ఫ్లాప్ దక్కిన సంగతి మన అందరికి తెలిసిందే..చిరంజీవి ఫాన్స్ ని ఈ స్థాయిలో నిరాశ పరిచిన సినిమా మరొక్కటి లేదు అని సోషల్ మీడియా లో నెటిజెన్లు పెదవి విరుస్తున్నారు..దానితో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాలపై ఆచి తూచి అడుగులు వేస్తున్నాడట..ప్రస్తుతం ఆయన భోళా శంకర్ మరియు గాడ్ ఫాదర్ సినిమాలు చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే..అది పక్కన పెడితే ఔట్పుట్ విషయం లో ఎక్కడ కూడా తగ్గకుండా, అవసరం అయితే రీ షూట్స్ కూడా చేయించే ప్లాన్ లో ఉన్నాడట మెగాస్టార్..అంతే కాకుండా ఒప్పుకున్న ఈ సినిమాలు అన్ని పూర్తి చేసిన చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..వాస్తవానికి ఈ క్రేజీ కాంబినేషన్ ని ఎప్పుడో అధికారికంగా ప్రకటించాడు చిరంజీవి..కానీ అది కార్య రూపం దాల్చడానికి ఇన్ని రోజుల సమయం పట్టింది.

Also Read: Shruti Haasan: అమ్మో పెళ్లంటే భయం అంటున్న శృతి… అంటే ఆమె ఆంతర్యం ఏమిటీ?
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు నుండి ప్రారంభం కానుంది..ఈ సినిమా పూర్తి అయిన తర్వాత చిరంజీవి సినిమాకి షిఫ్ట్ అవుతాడట త్రివిక్రమ్..గతం లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన జై చిరంజీవ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు..విజయ భాస్కర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినప్పటికీ త్రివిక్రమ్ డైలాగ్స్ చిరంజీవి నోటి నుండి తూటాలు లాగ పేలాయి..థియేట్రికల్ గా హిట్ సినిమా కాకపోయినా..బుల్లితెర పై బంపర్ హిట్..మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమా అంటే కచ్చితంగా అంచనాలు భారీ స్థాయిలో ఉండడం సహజం..మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి మెగాస్టార్ చిరంజీవి ని ఎలా చూపిస్తాడో చూడాలి..ఈ సినిమాకి నిర్మాతగా DVV దానయ్య వ్యవహరిస్తాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి స్థాయి వివరాలు అధికారికంగా తెలియాలి అంటే కొంతకాలం ఎదురు చూడక తప్పదు.
Also Read: Heavy Rains : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది చల్లని కబురు
Recommended Videos
[…] […]