Kalyan Dev: చిరంజీవి గారాల కూతురు శ్రీజ భర్త కెరీర్ అయోమయంలో పడింది. మామయ్య చిరంజీవి కనీస మద్దతు ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ కళ్యాణ్ దేవ్ చిత్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు. చిరంజీవి సూపర్ హిట్ మూవీ విజేత టైటిల్ తో వెండితెరకు పరిచయమయ్యాడు కళ్యాణ్ దేవ్. 2018లో విడుదలైన విజేత చిత్రం ఓ మోస్తరు టాక్ సొంతం చేసుకుంది. విజేత చిత్రానికి చిరంజీవి ప్రచారం కల్పించారు. దీంతో ఆ మూవీ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది.

ఇక కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రంగా సూపర్ మచ్చి చేశారు. 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల చేశారు. సూపర్ మచ్చి చిత్రాన్ని మెగా హీరోలు ఎవరూ పట్టించుకోలేదు. ఈ సినిమా ప్రోమోలు విడుదల చేయడం కానీ, ప్రమోషనల్ ఈవెంట్స్ పాల్గొనడం కానీ చేయలేదు. సంక్రాంతి బరిలో దిగిన కళ్యాణ్ దేవ్ మూవీ కనీస ఆదరణ దక్కించుకోలేదు. బంగార్రాజు, రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి విడుదల కాగా… బంగార్రాజు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read: Chiranjeevi – Trivikram: చిరంజీవి – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ.. ఫాన్స్ కి ఇక పండగే
కాగా కళ్యాణ్ దేవ్ లేటెస్ట్ మూవీ కిన్నెరసాని. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ జీ5 కొనుగోలు చేసింది. జూన్ 10న డైరెక్ట్ గా ఓటీటీలో కిన్నెరసాని చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఏ హీరో కూడా నేరుగా తన మూవీ ఓటీటీలో విడుదల కావాలని కోరుకోరు. థియేటర్స్ లో ఆడిన చిత్రాలకే గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కిన్నెరసాని హిట్ టాక్ తెచ్చుకుంటే హీరోగా కళ్యాణ్ దేవ్ కెరీర్ కి ప్లస్ అవుతుంది. చిరంజీవి తలచుకుంటే కిన్నెరసాని చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయవచ్చు.

మెగా హీరోల నుండి సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్న కళ్యాణ్ దేవ్ కి మరో ఆప్షన్ లేదు. దీంతో ఓటీటీ బాట పట్టారు. అల్లుడు కెరీర్ ప్రమాదంలో పడుతున్నా చిరంజీవి ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ఆసక్తికర విషయం. అసలు సంబంధం లేని వారికి కూడా అడగ్గానే సాయం చేసే చిరు, కళ్యాణ్ దేవ్ కెరీర్ ని ఎందుకు గాలికి వదిలేశాడు. కళ్యాణ్ దేవ్ అంటే చిరంజీవికి నచ్చడం లేదా వంటి అనుమానాలు కలుగుతున్నాయి.
ఆ మధ్య శ్రీజా-కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుంటున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. వారిద్దరికీ మధ్య విబేధాలు తలెత్తాయని పుకార్లు వెలువడ్డాయి. తాజా పరిస్థితులు చూస్తే ఆ వార్తల్లో నిజం ఉందేమో అనిపిస్తుంది. కూతురు విషయంలో చిరంజీవి కళ్యాణ్ దేవ్ ని ద్వేషిస్తున్నాడా? అందుకే మెగా హీరోలు అతని సినిమాలను ప్రమోట్ చేయడం లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో అనేక సందేహాలు ఉండగా కాలమే సమాధానం చెప్పాలి.
Also Read:Trivikram- Pooja Hegde: త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూజ హెగ్డే ఆగ్రహం..? కారణం అదేనా??