
నిన్న ఏప్రిల్ 29.. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు ఇప్పటిదాకా ఎవరూ చూడని డ్యాన్స్ వీడియోలు కొన్ని వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు చిరంజీవి ప్రకటించడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ ప్రయత్నం విరమించడం జరిగింది.
స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి
దేశంలోనే కాదు అంతర్జాతీయం గా కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్న ప్రముఖ హిందీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త విన్న చిరంజీవి తన డాన్స్ వీడియో లు ట్విట్టర్ లో పోస్ట్ చేసే కార్యక్రమం విరమించు కొన్నాడట .. 2018 నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్న ఈ లెజెండరీ బాలీవుడ్ నటుడు ముంబయిలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 29 ఉదయం మరణించాడు.నిజానికి చిరంజీవి ఉదయం డ్యాన్స్ వీడియోల గురించి ట్విట్టర్ లో ప్రకటన చేసే సమయానికి ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త ఆయనకు తెలియలేదు. తర్వాత ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త తెలుసుకొన్న చిరంజీవి తన డాన్స్ వీడియోల విరమణ ద్వారా నివాళి అర్పించాడు.
రాజస్థాన్ లోని జైపూర్ లో పుట్టిన సహాబజాదే ఇర్ఫాన్ అలీ ఖాన్ , నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ( N S D ) లో నసీరుద్దీన్ షా ప్రముఖుల ఆద్వర్యం లో నటన నేర్చుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. 1988 లో `సలాం బాంబే ‘ చిత్రం తో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఇర్ఫాన్ ఖాన్ ” హాసిల్ , పాన్ సింగ్ తోమర్ , మఖ్బూల్ , లైఫ్ ఇన్ మెట్రో , ది లంచ్ బాక్స్ , హిందీ మీడియం , తల్వార్ వంటి హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పిచడం జరిగింది అంతేకాదు ” జురాసిక్ వరల్డ్ ,. ది అమేజింగ్ స్పైడర్ మాన్ ,, ఇన్ ఫెర్నో,, స్లమ్ డాగ్ మిలియనీర్ ,, లైఫ్ అఫ్ ఫై ,, ది నేమ్ సేక్ , , ది వారియర్ , ఎ మైటీ హార్ట్ ” వంటి ఆంగ్ల చిత్రాల్లో నటించి విశ్వ ఖ్యాతి సంపాదించాడు. భార్య సుతాప సిఖ్దర్ , విద్యా బాలన్ నటించిన ” కహాని ” చిత్ర రచయిత్రి ,అంతేకాదు N S D లో ఇర్ఫాన్ ఖాన్ సహచరి. .వీరికి బాబిల్ , అయాన్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు ..
ఇంతటి గొప్పనటుడికి చిరంజీవి నివాళి అర్పించడం నిజంగా సమర్థనీయం. అందులో ఎటువంటి సందేహం అక్కర లేదు .. .