Chiranjeevi : రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదగడం వెనుక చిరంజీవి కృషి చాలా ఉంది. కథలు, దర్శకుల ఎంపికలో చిరంజీవి తన వంతు పాత్ర వహిస్తారు. అందుకే రామ్ చరణ్ కి మంచి కథలు పడ్డాయి. అవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి ఆయనకు స్టార్డం తెచ్చిపెట్టాయి. అయితే ఓ మూవీ విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ ఫెయిల్ కాగా, రామ్ చరణ్ నిర్ణయం మేలు చేసిందట. ఒక చిత్రం ఎందుకు మిస్ అయ్యావని రామ్ చరణ్ ని చిరంజీవి తిట్టాడట. తీరా విడుదలయ్యాక ఆ మూవీ డిజాస్టర్ అయ్యిందట.
ఆ చిత్రం అనగనగా ఓ ధీరుడు. ఈ చిత్రానికి కే రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ దర్శకుడు. ప్రకాష్ హీరో రామ్ చరణ్ కి మంచి మిత్రుడు అట. అనగనగా ఓ ధీరుడు టీజర్ చూసిన చిరంజీవి ఒకింత అసహనం వ్యక్తం చేశాడట. ప్రకాష్ నీకు బెస్ట్ ఫ్రెండ్. ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యావని కోప్పడ్డాడట. ఈ విషయాన్ని అనగనగా ఓ ధీరుడు ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ స్వయంగా చెప్పాడు.
కానీ ఈ మూవీ డబుల్ డిజాస్టర్ అయ్యింది. 2011లో విడుదలైన అనగనగా ఓ ధీరుడు జానపద చిత్రంగా తెరకెక్కింది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ ని ప్రేక్షకులు ఆ జానర్ లో జీర్ణించుకోలేకపోయారు. దానికి తోడు హీరో గుడ్డివాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అమెరికన్ యాక్సెంట్ తో కూడిన మంచు లక్ష్మి గ్రాంధికం డైలాగ్స్ ప్రేక్షకులకు పరీక్ష పెట్టాయి. అమెరికా నుండి వచ్చిన మంచు లక్ష్మి ఈ చిత్రంలో మెయిన్ విలన్ రోల్ చేసింది.
మొత్తంగా అనగనగా ఓ ధీరుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఈ సినిమా చేసి ఉంటే రామ్ చరణ్ కెరీర్ ఇబ్బందుల్లో పడేది. మగధీర మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ కి ఆరంజ్ రూపంలో ప్లాప్ పడింది. ఈ సినిమా అనంతరం అనగనగా ఓ ధీరుడు వంటి అల్ట్రా డిజాస్టర్ పడి ఉంటే కోలుకోవడానికి సమయం పట్టేది. రచ్చ మూవీ చేసి రామ్ చరణ్ ఓ మోస్తరు విజయం ఖాతాలో వేసుకున్నాడు. అనగనగా ధీరుడు మూవీ రామ్ చరణ్ చేయకపోవడం మంచిది అయ్యింది.