MAA Elections 2021: మొన్న పవన్.. నేడు చిరంజీవి.. మీడియా అతిపై సెటైర్లు

MAA Elections 2021: మా ఎన్నికల వేళ వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు విమర్శలు ప్రతివిమర్శలతో రచ్చరంబోలా చేసిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఎన్నికల వేళ హగ్ చేసుకొని తామంతా ఒక్కటేనని చాటిచెప్పారు. ఇన్నాళ్లు మీడియాకు ఎక్కి చేసిన రచ్చంతా పక్కనపెట్టి మొహంపై నవ్వులు పూసుకొని కౌగించుకున్నారు. మీడియాలో ఇంత గొడవ చేసి సినీ ప్రముఖులు వారికి కావాల్సినంత ఫుటేజ్ ను ఇచ్చి.. ఇండస్ట్రీ పరువును బజారుకీడ్చి ఇప్పుడిలా కలిసిపోవడం అందరినీ షాక్ కు […]

Written By: NARESH, Updated On : October 10, 2021 11:41 am
Follow us on

MAA Elections 2021: మా ఎన్నికల వేళ వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు విమర్శలు ప్రతివిమర్శలతో రచ్చరంబోలా చేసిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఎన్నికల వేళ హగ్ చేసుకొని తామంతా ఒక్కటేనని చాటిచెప్పారు. ఇన్నాళ్లు మీడియాకు ఎక్కి చేసిన రచ్చంతా పక్కనపెట్టి మొహంపై నవ్వులు పూసుకొని కౌగించుకున్నారు.

మీడియాలో ఇంత గొడవ చేసి సినీ ప్రముఖులు వారికి కావాల్సినంత ఫుటేజ్ ను ఇచ్చి.. ఇండస్ట్రీ పరువును బజారుకీడ్చి ఇప్పుడిలా కలిసిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే మీడియా మాత్రం ఈ ‘మా’ఎన్నికలను పండుగ చేసుకుంది. ఇరువర్గాలను ఇంటర్వ్యూలు చేస్తూ వారి కామెంట్లను హైలెట్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది.

‘మీడియా’ చేస్తున్న అతిపై ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రజాసమస్యలపై, అసహాయుల ఆక్రందనపై స్పందించాలని.. ఇలా సినీ ప్రముఖులపై టైం వేస్ట్ చేయవద్దని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ వేడుకలో సాయిధరమ్ తేజ్ విషయంలోనూ మీడియా వ్యవహరించిన తీరును ఎండగట్టారు.

తాజాగా ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా మీడియాకు సుతిమెత్తగా గడ్డిపెట్టేశాడు. మా ఎన్నికల్లో ఇంత హైప్ రావడానికి కారణంగా మీడియా అతినే అని చిరంజీవి స్పష్టం చేశారు. ఎప్పుడూ ఈ పరిస్థితులు ఒకేలా ఉండవని.. మీడియానే ఇంత బాగా పైకిలేపారని చిరంజీవి అన్నారు.

‘మా’ ఎన్నికల వల్ల మీడియాకు చాలా హాయిగా మంచి మెటీరియల్ దొరికిందంటూ చిరంజీవి మీడియా ముఖంగానే సెటైర్లు వేశారు. ఒక్కోసారి పరిస్థితులు మారుతుంటాయని.. అందుకు అనుగుణంగా సమాయత్తం కావాలని చిరంజీవి హితవు పలికారు.