Chiranjeevi: తమిళ్ సినిమా ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్ లలో శంకర్ మొదటి స్థానం లో ఉంటాడు. ఇక ఈయనతో సినిమా చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి శంకర్ వరుసగా మంచి సినిమాలు చేస్తూ తెలుగు లో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక తెలుగు లో కూడా ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇలాంటి క్రమంలో శంకర్ తన మొదటి సినిమా అయిన జెంటిల్ మెన్ సినిమాని యాక్షన్ కింగ్ అర్జున్ తో చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇక అప్పటి నుంచి ఆయన వరుసగా రోబో సినిమా వరకు అన్ని సక్సెస్ ఫుల్ సినిమాలే చేశాడు. ఇక ఆయన మొదటి సినిమా అయిన జెంటిల్ మెన్ సినిమాని మొదటగా చిరంజీవితో చేద్దామని అనుకున్నాడు. కానీ చిరంజీవి అప్పటికే కొందండ రామిరెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయి ఉండటం తో శంకర్ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఇక ఆ తర్వాత శంకర్ రాజశేఖర్ తో ఈ సినిమా చేయాలి అని అనుకున్నప్పటికీ రాజశేఖర్ కూడా అదే ప్రాబ్లంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. ఇక దాంతో అర్జున్ తో ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన వరుస సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఇక అప్పటి నుంచి చిరంజీవి శంకర్ తో సినిమా చేయాలని చాలా వరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వీలు కావడం లేదు.ఇక దాంతో శంకర్ ఇప్పుడు చిరంజీవి వాళ్ల అబ్బాయి అయిన రామ్ చరణ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చెంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా అసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుంది అని మెగా అభిమానులందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా మీద శంకర్ ఏ విధమైన క్లారిటీ ఇవ్వడం లేదు.
ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ ని తప్ప గ్లింప్స్ గానీ , టీజర్ గాని ఏది రిలీజ్ చేయకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా మీద కొంతవరకు అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో శంకర్ మరొకసారి పాన్ ఇండియా డైరెక్టర్ గా తన స్టామినా ఏంటో చూపించాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేకపోవడంతో మెగా అభిమానులు , శంకర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు…