Chiranjeevi – Ravi Teja: కొన్ని కాంబినేషన్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి – మాస్ మహారాజా రవితేజ కలిసి నటించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 154 వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గెస్ట్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పటికే బాగా వైరల్ అయింది కూడా. అయితే, ఈ రోజు ఈ ఇద్దరూ ఓ సినిమా వేదిక మీదకు రాబోతున్నారు.

సుధీర్‌వర్మ దర్శకత్వంలో రవితేజ, సుమంత్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. సినిమా పేరు ‘రావణాసుర’. కాగా ఈ సినిమా నేడు మొదలు కానుంది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చిరంజీవి రానున్నారు. ఏది ఏమైనా సినీ పరిశ్రమలో స్వయంశక్తితో ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఇక చిరంజీవినే ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చి చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ హీరో నుంచి మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ. మరి చాలాకాలం తర్వాత వీరిద్దరూ ఒకే స్టేజ్‌పైకి వస్తుండటంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయింది.
Also Read: విషాదం : రోడ్డు ప్రమాదంలో నటి.. కూతురు మృతి !
బాబీ దర్శకత్వంలో రానున్న మెగాస్టార్ చిరంజీవి 154 వ చిత్రంలో రవితేజ నటిస్తే చాలా బాగుంటుంది. అన్నట్టు ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పెట్టారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. పైగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు.
Also Read: సామ్-చై విడాకులతో నిలిచిపోయిన క్రేజీ ప్రాజెక్ట్..!
[…] Dil raju:‘దిల్ రాజు’ సక్సెస్ వెనుక ప్రధాన కారణం.. టాలెంట్ పర్సన్స్ ను వెతికి పట్టుకుని వాళ్ళను తన కాంపౌండ్ లోనే అట్టి పెట్టుకోవడం. అందుకే, దిల్ రాజు బ్యానర్ లో కంటిన్యూగా ఎవరు పని చేస్తున్నాడు అంటూ నిర్మాతల ఆరా తీస్తూ ఉంటారు. కానీ, దిల్ రాజు తనకు పనికొచ్చే ఎవర్నీ అంత తేలిగ్గా వదిలిపెట్టడు. ప్రస్తుతం ‘దిల్’ రాజు తన తమ్ముడు శిరీష్ తనయుడు ఆశిష్ సినిమా రిలీజ్ పనుల్లో ఉన్నాడు. […]