Chiranjeevi And Ram Charan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. దాదాపు 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కారణమేదైనా కూడా ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా విషయంలో ఆయన ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇకమీదట నుంచి ఆయన భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి – రామ్ చరణ్ కాంబినేషన్లో ఇంతకుముందు ‘ఆచార్య’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మారడంతో వీళ్ళ కాంబినేషన్లో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు భయపడిపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఒక స్టార్ డైరెక్టర్ వీళ్లిద్దరిని కలిపి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నెల్సన్ కావడం విశేషం…
ప్రస్తుత ఆయన ‘జైలర్ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ లతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చిరంజీవి, రామ్ చరణ్ లను పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంతున్నట్టుగా తెలుస్తుంది.
రీసెంట్గా చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరికి ఒక కథనైతే వినిపించారట. వారిద్దరికి కథ బాగా నచ్చడంతో ఈ సినిమాని తప్పకుండా మనం చేద్దామని చిరంజీవికి మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి – రామ్ చరణ్ ఇద్దరు కూడా బిజీ షెడ్యూల్స్ తో ఉన్నారు. నెల్సన్ సైతం రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాలు ముగిసిన తర్వాత వీళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా నెల్సన్ చాలా మంచి దర్శకుడు అతను అనుకున్నది అనుకున్నట్టుగా చేసి ప్రేక్షకులందరిని మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు…అందుకే ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకుడి నిరాశపరచడం లేదు. కాబట్టి అతను చాలా తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో కూడా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…