Chiranjeevi Radhika New Movie: మెగాస్టార్ చిరంజీవికి రాధికా శరత్ కుమార్ కి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఆమెను చిరు తన సన్నిహితురాలిగా ఫీల్ అవుతారు. ఇక రాధికా శరత్ కుమార్ ప్రస్తుతం సినిమాల నిర్మాణంలో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె పలు సినిమాలను ప్రకటించారు. కొన్ని సినిమాలు అయితే, ఆల్ రెడీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆమె ఓ భారీ సినిమా ప్లాన్ చేసింది.

చిరు ఆమెతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని రాధికా శరత్ కుమార్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తన బ్యానర్లో మెగాస్టార్ ఒక మెగా ప్రాజెక్టు చేయనున్నట్టుగా అధికారికంగా ఆమె వెల్లడించింది. ఏది ఏమైనా రాధిక తన బ్యానర్ ‘రాడాన్’ను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నిర్మాతగా ఎంతో పేరు గడించారు.
అటు బుల్లితెరపై సీరియల్స్ నిర్మిస్తూనే.. ఇటు వెండితెర పై భారీ సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగాస్టార్ కి కథ చెప్పాలని చూస్తున్నారు. కాస్త విషయం ఉన్న డైరెక్టర్ ను కదిలించినా మెగాస్టార్ కి కథ రాస్తున్నా అంటున్నారు. పైగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాకా.. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నాడు.
వయసు పై బడిన అదే ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే చిరు, రాధిక నిర్మాణంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఐతే, ఈ సినిమా డైరెక్టర్ పై ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. రాధిక – చిరు ఒక యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తొంది. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్ ? ‘నీదీ నాదీ ఒకే కథ`తో ఆకట్టుకొన్నాడు వేణు ఉడుగుల.

ఇప్పుడు రానాతో `విరాటపర్వం` తెరకెక్కించాడు. ఈ దర్శకుడు చిరంజీవికి ఆ మధ్య ఒక కథ చెప్పారు. విరాట పర్వం టీజర్ చిరు చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో వేణు ఉడుగుల – చిరు మధ్య కథకు సంబంధించి చర్చలు జరిగాయి. `మంచి కథ చెప్పావు. మనం కలిసి సినిమా చేద్దాం` అని అప్పుడే చిరు మాట ఇచ్చారు. ఆ మాట రాధిక నిర్మాణంలో నెరవేరబోతోంది.
Also Read: Rashmika Mandanna: రష్మికతో ఫస్ట్ రొమాన్స్, తర్వాత లవ్.. క్రేజీ అప్ డేట్ !
Recommended Videos
[…] Also Read: Chiranjeevi Radhika New Movie: ‘చిరంజీవి – రాధికా’ కొత్త… […]
[…] Also Read: Chiranjeevi Radhika New Movie: ‘చిరంజీవి – రాధికా’ కొత్త… […]