https://oktelugu.com/

Chiranjeevi : అల్లు అర్జున్, ఎన్టీయార్ బాటలో చిరంజీవి… వర్కౌట్ అవుతుందా..?

ఈ సినిమా లేట్ అయిన కూడా చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇంతకు ముందు భోళా శంకర్ సినిమాతో భారీగా దెబ్బతిన్న చిరంజీవి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి తన రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : February 29, 2024 / 09:17 PM IST
    Follow us on

    Chiranjeevi : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తుంది. సినిమా ఎండింగ్ లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి దాన్ని సెకండ్ పార్ట్ కి లీడ్ గా వాడుకుంటున్నారు. ఇక దానికి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుండడంతో ప్రతి సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. మరి అవి ఎప్పుడు తెరకెక్కిస్తారో తెలియదు కానీ సిక్వెల్స్ ని అయితే అనౌన్స్ చేస్తున్నారు. ఇక ప్రాపర్ గా సీక్వెన్స్ ని చేయాలనే ఉద్దేశ్యం తో కొంతమంది వాటినిఅనౌన్స్ చేస్తుంటే సినిమా మీద బజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే మరి కొంతమంది అలా చేస్తున్నారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప 2 తో సీక్వెల్ చేస్తుంటే, ఎన్టీయార్ కూడా దేవర సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందని అనౌన్స్ చేశాడు…

    ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది. అది ఏంటి అంటే ఈ సినిమాకి కూడా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వశిష్ట తన మొదటి సినిమా ఆయన బింబిసార సినిమాకి కూడా సీక్వెల్ ను అనౌన్స్ చేసాడు. ఇక అదే బాటలో విశ్వంభర సినిమాకి కూడా సీక్వెల్ ను రెడీ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే విశ్వంభర సినిమా క్లైమాక్స్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ తో ఈ సినిమా సీక్వెల్ కి లీడ్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.
    ఇక మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాతో భారీగానే ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థం అవుతుంది. ఒకప్పుడు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో ఎలా అయితే ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టాడో, ఇప్పుడు కూడా చిరంజీవి అదే సీను ను రిపీట్ చేయాలని చూస్తున్నాడు.

    అందుకే ఈ సినిమా లేట్ అయిన కూడా చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇంతకు ముందు భోళా శంకర్ సినిమాతో భారీగా దెబ్బతిన్న చిరంజీవి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి తన రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ తీయాలి అంటే మొదటి పార్ట్ తప్పకుండా సక్సెస్ అవ్వాలి… చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో…